శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Jul 09, 2020 , 01:48:41

వైద్య సేవలు మరింత చేరువ

వైద్య సేవలు మరింత చేరువ

ఖలీల్‌వాడి : ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలను అం దించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఆలన’ వాహనాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం జిల్లా కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యా ధులతో బాధపడేవారికి ఈ వాహన సేవలు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. బాల్కొండ, చౌట్‌పల్లి, వేల్పూర్‌, కమ్మర్‌పల్లి, కిసాన్‌నగర్‌, మెండోరా, మోర్తాడ్‌ ప్రాథమిక కేంద్రాల్లో ఒక వాహనం ద్వారా వైద్యబృందం ఆరోగ్య సేవలను అందిస్తుందని చెప్పారు. ఇందులో ఒక డాక్టర్‌, ఒక నర్సు అందుబాటులో ఉంటారని, గ్రామాల్లో గుండెజబ్బులు, క్యాన్సర్‌, టీబీ, బీపీ, మధుమేహం, పక్షవాతం తదితర వ్యాధులతో బాధపడేవారికి ఇంటి వద్దనే చికిత్సలు అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం, డాక్టర్లు శంభు, గంగాధర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

కామారెడ్డిలో వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ 

విద్యానగర్‌ : జిల్లా వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం కేటాయించిన ‘ఆలన’ వాహనాన్ని కలెక్టర్‌ శరత్‌ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దవాఖానకు వచ్చే స్థితిలో లేని వారికి, వృద్ధులకు సేవలందించేందుకు ఆలన వాహనాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని కామారెడ్డి యూపీడబ్ల్యూసీ, రాజీవ్‌నగర్‌ యూపీహెచ్‌సీ, దేవునిపల్లి, భిక్కనూరు, మాచారెడ్డి, సదాశివనగర్‌ పీహెచ్‌సీ పరిధిలో వాహనం ద్వారా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. డాక్టర్లు దేవయ్య, సువర్ణ ఆలన వాహనం ద్వారా వ్యాధిగ్రస్తుల ఇంటికి వెళ్లి వైద్యసేవలు అందిస్తారన్నారు. ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ అజయ్‌ కుమార్‌, వైద్యులు రాజు, సుస్మిత్‌రాయ్‌, ఇద్రిస్‌, సంజీవ్‌రెడ్డి, రాణి, అన్వర్‌, సుధాకర్‌, విశాలరాణి పాల్గొన్నారు.


logo