ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
మంత్రి పువ్వాడ | మన గాలి, మన ఆక్సిజన్ అనే నినాదంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రూ.90 లక్షలతో నిర్మించిన ఆక్సిజన్ ఉత్పత్తి(Oxygen Generated Plant) సెంటర్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.

ఖమ్మం : మన గాలి, మన ఆక్సిజన్ అనే నినాదంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రూ.90 లక్షలతో నిర్మించిన ఆక్సిజన్ ఉత్పత్తి(Oxygen Generated Plant) సెంటర్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.
కరోనా విజృంభిస్తున్న తరుణంలో మంత్రి సూచనల మేరకు ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. గత ఏడాది లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేయగా దానికి హైదరాబాద్ నుంచి ఆక్సిజన్ రావాల్సిన పరిస్థితి ఉండేది.
అయితే ఆయా ఆక్సిజన్‌ను ఖమ్మలోనే ఉత్పత్తి చేసుకునేందుకు ఆక్సిజన్ జనరేటెడ్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 125 సిలిండర్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుతో ప్రభుత్వ దవాఖానలో దాదాపు ఆక్సిజన్ సమస్య తీరింది. ఇక అన్ని సందర్భాల్లో రోగులకు నిత్యం ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

