e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home జిల్లాలు సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి

సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి

సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్‌ పట్టణ సుందరీకరణ, సరస్వతీ కెనాల్‌ నిర్మాణ పనుల పరిశీలన
రైతులకు జీలుగ విత్తనాలు అందజేత

నిర్మల్‌ అర్బన్‌, మే 21 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్‌ పట్టణంలో శివాజీ చౌక్‌ నుంచి గాజుల్‌పేట్‌ వరకు చేపట్టిన రోడ్డు సుందరీకరణ పనులను కాలినడకన పర్యవేక్షించారు. మురుగు కాలువల నిర్మాణం, ఫుట్‌పాత్‌ రోలింగ్‌, ఆటోస్టాండ్‌, నాగమాత ఆలయం వద్ద చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ట్యాంక్‌ బండ్‌ వద్ద గల జాతీయ జెండా ప్రాంతంలో పార్కును ఏర్పాటు చేస్తామని తెలిపారు. పట్టణంలోని బస్టాండ్‌ ప్రాంతంలో సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు.

పచ్చిరొట్ట సాగుపై విస్తృత ప్రచారం చేయాలి
నిర్మల్‌ టౌన్‌, మే 21 : నిర్మల్‌ జిల్లాలో జీలుగ విత్తనాలను సబ్సిడీపై అందిస్తామని, పచ్చిరొట్ట సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయా చోట్ల ఎఫ్‌ఎసీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీగారి రాజేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్ర త్‌ ఈశ్వర్‌, నిర్మల్‌ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మారుగొండ రాము, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు డాక్టర్‌ సుభాష్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్‌, కౌన్సిలర్లు నేరేళ్ల వేణు, బిట్లింగ్‌ నవీన్‌, పూదరి రాజేశ్వర్‌, ఎస్పీ రాజు, ఏడీఏ వినయ్‌బాబు, ఏవోలు వసంత్‌, నాగరాజు పాల్గొన్నారు.

సరస్వతీ కెనాల్‌ పనుల పరిశీలన
సోన్‌, మే 21 : కడ్తాల్‌ గ్రామం నుంచి సోఫీనగర్‌ వర కు రహదారి విస్తరణలో భాగంగా చేపట్టి న సరస్వతీ కాలువ వెడల్పు పనులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. రూ. 4 కోట్లతో రోడ్డు వెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు చేపడుతున్నట్లు వివరించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మన్‌ రాజేందర్‌, వైస్‌ చైర్మన్‌ సాజిద్‌, తదితరులున్నారు.

ఎంపీపీ కూతురు వివాహానికి మంత్రి హాజరు
దిలావర్‌పూర్‌, మే 21 : ఎంపీపీ ఏలాల అమృ త చిన్నారెడ్డి దంపతుల కూతురు వివాహం గుం డంపల్లిలో జరిగింది. దీనికి మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్‌ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. మాజీ ఎంపీపీ పాల్దే శ్రీనివాస్‌ అక్క కుమారుడి వివాహం ఇటీవల జరుగగా మంత్రి వారి ఇంటికెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించా రు. టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, నిర్మల్‌ జడ్పీ చైర్‌ప ర్సన్‌ విజయలక్ష్మీరాంకిషన్‌రెడ్డి దంపతులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, మంత్రి అల్లో ల సోదరుడు అల్లోల్ల మురళీధర్‌రెడ్డి, సారంగాపూర్‌, నర్సాపూర్‌ జడ్పీటీసీలు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, అర్గుమీది రామ య్య, నర్సాపూర్‌(జీ) ఎంపీపీ కొండ్రురేఖ రమేశ్‌, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్‌ పీవీ రమణారెడ్డి, నిర్మల్‌ ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీగారి రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి

ట్రెండింగ్‌

Advertisement