శనివారం 28 నవంబర్ 2020
Nirmal - Oct 30, 2020 , 00:38:55

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కే విజయం

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కే విజయం

కుంటాల: దుబ్బాకలో జరుగుతున్న ఉప పోరులో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని పార్టీ మండల బాధ్యులు  అనిల్‌ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి ఆదేశాలతో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రచారంలో భాగంగా గురు వారం మంత్రి హరీశ్‌ రావును కలిశారు. రాజు, సుధాన్‌రెడ్డి,  రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.