మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Oct 15, 2020 , 02:00:52

దమ్మచక్ర పరివర్తన దినోత్సవం

దమ్మచక్ర పరివర్తన దినోత్సవం

నిర్మల్‌ టౌన్‌ : పట్టణంలోని సోఫీనగర్‌ బుద్ధ విహార్‌ కార్యాలయంలో బుధవారం దమ్మ చక్ర పరివర్తన దినోత్సవం నిర్వహించారు. బుద్ధ విహా ర్‌ ట్రస్ట్‌ నాయకులు పంచరంగుల జెండా ఎగుర వేశారు. కార్యక్రమంలో  నాయకులు వెంకటస్వామి, శ్రీనివాస్‌, మధూకర్‌, డీ రాములు, ప్రభాకర్‌, భీంరావు, అడెల్లు, రాజన్న, ప్రసాద్‌, అరుణ, వాణి, వినీత, పాల్గొన్నారు. 

భైంసా : ఆల్‌ఇండియా ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం దమ్మచక్ర పరివర్తన దివస్‌ నిర్వహించారు.  పట్టణంలో ని రాహుల్‌ నగర్‌ బుద్ధ విహార్‌లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘం డివిజన్‌ అధ్యక్షుడు సట్వాజీ సాంగే బుద్ధుడి విగ్రహానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంజు, ప్రకాశ్‌, గిరిధరి జంగ్మే, దేవిదాస్‌, యశ్వంత్‌ బన్సోడే తదితరులున్నారు. 

దస్తురాబాద్‌ : అంబేద్కర్‌ సంఘం ఆధ్వర్యంలో దమ్మ చక్ర పరివర్తన దివస్‌ నిర్వహించారు. రాజ్యాంగ పరి రక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  అంబేద్కర్‌ సంఘం మండల అధ్యక్షుడు మునేసుల శైలేందర్‌ అన్నారు. కార్యక్రమం లో నాయకులు రవి, నర్సయ్య, బొమ్మెన సురేశ్‌, దుబ్బయ్య, నర్సయ్య, రమేశ్‌ పాల్గొన్నారు.


logo