e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home జిల్లాలు అభివృద్ధిని ఓర్వలేనోళ్లకు పుట్టగతులుండవ్‌

అభివృద్ధిని ఓర్వలేనోళ్లకు పుట్టగతులుండవ్‌

అభివృద్ధిని ఓర్వలేనోళ్లకు పుట్టగతులుండవ్‌

నామినేషన్‌ వేసేందుకు భయపడుతున్న ప్రతిపక్షాలు
తీన్మార్‌ మల్లన్న.. ప్రకృతి నీచేతుల్లో ఉందా?
ఇక నిరంతరం అభివృద్ధి పనులే..
ఇంటింటికీ మిషన్‌ భగీరథ జలం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్‌ అర్బన్‌, జూలై 18 : అభివృద్ధిని చూసి ఓర్వలేని వారికి పుట్టగతులుండవని, వారికి ప్రజ లే తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో రూ.37.05 కోట్లతో గాంధీ పార్కులో నిర్మించిన మిషన్‌ భగీరథ తాగునీటి వాటర్‌ ట్యాంకును ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి పలువురు పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ.. నిర్మల్‌ పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని అన్నారు. 2003లో స్వర్ణ ప్రాజెక్టు నుంచి సిద్దాపూర్‌కు తాగునీటి ఇబ్బందులు తలెత్తినప్పుడు రూ.32 కోట్లతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి పైప్‌లైన్‌ ద్వారా పట్టణ ప్రజలకు నిరంతరం తాగునీటిని అందించామన్నారు. ప్రజలకు శుద్ధ జలం అందించాలన్న లక్ష్యంతో 42 వార్డుల ప్రజలకు రూ.40 కోట్లతో పట్టణంలో 39 లక్షల లీటర్ల సామర్థ్యమున్న ఐదు ట్యాంకులను నిర్మించుకుంటున్నామన్నారు. పట్టణ ప్రజలకు మిషన్‌ భగీరథ నీటిని అందించేందుకు 97.17 కిలో మీటర్ల్ల పైప్‌లైన్‌ వేశామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్‌ చేపడుతున్నారన్నారు. అటు రాష్ట్రం లో, ఇటు నిర్మల్‌ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు భవిష్యత్‌లో ఇక నామినేషన్‌ ఎలా వేయాలోనని ఇప్పటి నుంచే భయపడుతున్నాయని అన్నారు.
తీన్మార్‌ మల్లన్న.. ప్రకృతి నీ చేతుల్లో ఉందా..?
తీన్మార్‌ మల్లన్నపై మంత్రి మండిపడ్డారు. నిర్మల్‌లో ఇటీవల15 సెంటీమీటర్ల వర్షం కురిసిందన్నారు. దీంతో రోడ్లపై నీరు పారడం సహజమేనని, ఈ దృశ్యాలను క్యూ న్యూస్‌లో ప్రచారం చే యడం సరైంది కాదన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు పంపిన వీడియోను ప్రసారం చే యడం ఏమిటని, ప్రకృతి వైపరీత్యాలు మీ చేతు ల్లో ఉన్నాయా..? పెద్దపెద్ద నగరాల్లో సైతం వర్షపునీరు రోడ్లపై పారుతుందని తెలిపారు. సము ద్రం పొంగిపొర్లినప్పుడు గ్రామాలు నీట మునిగే అవకాశాలున్నాయని, అభివృద్ధిని కళ్లారా చూడలేనివారు పంపిన వీడియోలతో మీకే చెడ్డ్డపేరు వస్తుందని హెచ్చరించారు. నీరు నిలవడంతో అ ప్రమత్తమైన అధికారులు గంటలోనే మున్సిపల్‌ సిబ్బందితో మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరించారని తెలిపారు. అభివృద్ధి చేసేటోళ్లను విమర్శించుడే ప్రతిపక్షాల పని అని, వారికి పుట్టగతులుండవన్నారు. అనంతరం మంత్రి, జిల్లా ప రిషత్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ను శాలువాతో సన్మానించారు. అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌ రెడ్డి, కౌన్సిలర్‌ అయ్యన్నగారి రాజేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, ఈఈ సంతోష్‌ కుమార్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేవి బోనాల పండుగ అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో నిర్వహించిన ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం బోనాలను ఎంతో ఘనంగా జరుపుకునే వాళ్లమని, కరోనా కారణంగా గత సంవత్సరం నిరాడంబరంగా, భౌతికదూరం పాటించి చేసుకుంటున్నామన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రభు త్వం ఆధ్వర్యంలో బోనాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. నందిగుండం ఆలయాన్ని రూ.50 లక్షలతో నిర్మించామన్నారు. అమ్మవారి కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. నందిగుండం దుర్గామాత ఆలయ అధ్యక్షుడు లక్కాడి జగన్‌మోహన్‌ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, కొండాజీ వెంకటాచారి, కాళేశ్వర ఆలయ డైరెక్టర్‌ కొరిపెల్లి దేవేందర్‌ రెడ్డి, ఆకోజి కిషన్‌, దశరథ్‌, నర్సయ్య, రవి, స్థానిక కౌన్సిలర్‌ అయ్యన్నగారి రాజేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, ఈఈ సంతోష్‌ కుమార్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత..
నిర్మల్‌ పట్టణంలోని శాంతినగర్‌ కాలనీకి చెందిన రంగస్వామి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందారు. ఈ విషయాన్ని కౌన్సిలర్‌ సం పంగి రవి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి దృష్టి తీసుకెళ్లారు. మంజూరైన రూ.60 వేల చెక్కును క్యాంపు కార్యాలయంలో మంత్రి అందజేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, కాళేశ్వర ఆలయ డైరెక్టర్‌ కొరిపెల్లి దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్‌, ప్రముఖ వ్యాపార వేత్త అల్లోల మురళీధర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధిని ఓర్వలేనోళ్లకు పుట్టగతులుండవ్‌
అభివృద్ధిని ఓర్వలేనోళ్లకు పుట్టగతులుండవ్‌
అభివృద్ధిని ఓర్వలేనోళ్లకు పుట్టగతులుండవ్‌

ట్రెండింగ్‌

Advertisement