Yoga course in OU : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఓయూ దూరవిద్యా కేంద్రం కూడా మారుతున్నది. ముఖ్యంగా సమాజానికి అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టింది. కరోనా నేపథ్యంలో ప్రజల్లో వ్యాయామం, యోగా, మెడిటేషన్, డైటింగ్ వంటి పలు అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో యోగాకు విపరీతమైన డిమాండ్ ఏర్పడగా ఇందుకనుగుణంగా దూరవిద్యా విధానం ద్వారా ఆ కోర్సును అందించబోతున్నారు. ఇందుకవసరమైన ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారు యూనివర్సిటీ అధికారులు. వీడియో పాఠాలు, టెస్ట్ బుక్కులు, సిలబస్ తయారు చేయించేందుకు నిపుణులతో యూనివర్సిటీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
డిప్లొమా ఇన్ డాటా సైన్స్..
ఓయూ దూర విద్యా విధానంలో డిప్లొమా ఇన్ డాటా సైన్స్, డిప్లొమా ఎంటర్పెన్యూర్షిప్ అనే రెండు కొత్త కోర్సులు కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి జనవరి మొదటివారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలను యూనివర్సిటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే సిలబస్, పుస్తకాలు, ఫ్యాకల్టీకి సంబంధించిన అంశాలపైనా చర్చించారు. వీటితో పాటు అదనంగా మరో నాలుగు రకాల కొత్త కోర్సులను దూర విద్యా విధానం ద్వారా అందించబోతున్నారు. వాటిలో జర్నలిస్టుల కోసం వీడియోగ్రఫీ, కామర్స్ డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, టూరిజం అండ్ కల్చర్ లాంటి కోర్సులను అందించబోతున్నారు. వీటికి మార్చి లేదా ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Celt | ఈ నెల 13 నుంచి ఓయూ సెల్ట్లో తరగతులు
Osmania university | ఉస్మానియా విద్యా సమాచారం
Symposium | 18, 19 తేదీలలో ఓయూ జువాలజీ విభాగంలో జాతీయ స్థాయి సింపోజియం