ఎంబీఏ (పీఈ) పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (పబ్లిక్ ఎంటర్ప్రైజెస్) పరీక్షా ఫీజు స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంబీఏ (పీఈ) నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, మూడు, అయిదో సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 20వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను ఈ నెలలోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www. osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
ప్రీ పీహెచ్డీ పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే ఈ పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పలుమార్లు పొడగించినట్లు చెప్పారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
పీజీడీబీఎం, పీజీడీబీ, పీజీడీఈఎల్టీ తదితర కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 27వ తేదీ నుంచి, ఓరియంటల్ లాంగ్వేజ్ సర్టిఫికెట్ కోర్స్, ప్రీ డిగ్రీ కోర్స్ మొదటి, రెండో సంవత్సరం, బీఏ (లాంగ్వేజెస్) మొదటి, రెండు, మూడో సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలను ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in?? http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.