Y Nagireddy | తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కార్మికుల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ చైర్మన్ వై నాగిరెడ్డి కీలక ప్రకటన చేశారు.
సమ్మె విరమించకపోతే కఠినమైన చర్యలు తప్పవని కార్మికులు, సిబ్బందిని హెచ్చరించారు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఒక వివాదం పెండింగ్లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమన్నారు. చట్టవిరుద్ధమైన సమ్మెలో పాల్గొనే వారిపై వేతన కోతతోపాటు, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికైనా సమ్మెను విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు.
Kailsas Bapu Kote | కుమార్తె కలుగాలన్న ఆశ నెరవేరకపోవడంతో ఆ దంపతులు ఏం చేశారో తెలుసా..?
Telangana High Court | పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే !