WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌కు ముహూర్తం ఖారారైంది. మెగా వేలం రోజునే టోర్నీ ఆరంభ తేదీని బీసీసీఐ వెల్లడించింది. ఊహించినట్టుగానే జనవరిలోనే నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. అయితే.. ముందుగా వినిపించిన జనవరి 7న కాకుండా జనవరి 9 నుంచి సీజన్ మొదలవ్వనుందని డబ్ల్యూపీఎల్ ఛైర్మన్ జయేశ్ జార్జ్(Jayesh George) పేర్కొన్నారు. పురుషుల టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ షెడ్యూల్‌ను ముందుకు జరిపిన విషయం తెలిసిందే.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ మ్యాచ్‌లకు ఈసారి రెండు వేదికలనే ఖరారు చేశారు. నవీ ముంబై (Mumbai), వడోదర (Vadodara)లోనే అన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తామని డబ్ల్యూపీఎల్ ఛైర్మన్ జయేశ్ జార్జ్ తెలిపారు. జనవరి 9న నవీ ముంబైలో టోర్నీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 5 న వడోదరలో ఫైనల్ బీసీసీఐ తెలిపింది. త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నారు.
WPL DATES ANNOUNCED!
The fourth edition of the Women’s Premier League will be held from January 9 to February 5, 2026, with DY Patil Stadium, Navi Mumbai, and Vadodara confirmed as the two host venues.
Details: https://t.co/n6czDlJODO pic.twitter.com/SlyOwNWnwJ
— Sportstar (@sportstarweb) November 27, 2025
డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ నాలుగు నగరాల్లో జరిగింది. ముంబై, బెంగళూరు, లక్నో, వడోదరలో మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే.. కొన్ని కారణాల వల్ల ఈసారి రెండు నగరాలను మాత్రమే ఎంచుకున్నారు. ఇప్పటివరకూ జరిగిన మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) రెండు పర్యాయాలు, ఆర్సీబీ(RCB) ఒకసారి విజేతగా నిలిచాయి. దాంతో.. నాలుగో సీజన్లో ఛాంపియన్‌గా నిలిచేందుకు ఢిల్లీ సిద్దమవుతుండగా.. తొలిసారి ట్రోఫీని ముద్దాడాలని యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ పట్టుదలతో ఉన్నాయి. నాలుగో ఎడిషన్ కోసం ఐదు ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న క్రికెటర్లు వీళ్లే..
ముంబై ఇండియన్స్ : నాట్ సీవర్ బ్రంట్ (రూ.3.5 కోట్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ.2.5 కోట్లు), హేలీ మాథ్యూస్(రూ.1.7కోట్లు), అమన్‌జోత్ కౌర్(రూ.1.0కోట్లు), జి. కమలిని(రూ.50 లక్షలు).
ఢిల్లీ క్యాపిటల్స్ : జెమీమా రోడ్రిగ్స్,(రూ.2.2 కోట్లు) షఫాలీ వర్మ(రూ.2.2 కోట్లు), మరినే కాప్(రూ.2.2 కోట్లు), అనాబెల్ సథర్లాండ్(రూ.2.2 కోట్లు), నిక్కీ ప్రసాద్ అన్క్యాప్డ్(రూ.50 లక్షలు).
యూపీ వారియర్స్ : శ్వేతా షెరావత్ (రూ.50 లక్షలు).
ఆర్సీబీ : స్మృతి మంధాన(రూ.3.5 కోట్లు), రీచా ఘోష్(రూ.2.75కోట్లు), ఎలీసా పెర్రీ(రూ.2 కోట్లు), శ్రేయాంక పాటిల్ (రూ.60లక్షలు)లను మాత్రమే రీటైన్ చేసుకుంది.
గుజరాత్ జెయింట్స్ : బేత్ మూనీ(రూ.3.5కోట్లు), అష్ గార్డ్నర్(రూ.2.5కోట్లు).