పెన్పహాడ్, నవంబర్ 27 : మలిదళ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండేటి వెంకట్రెడ్డి(52) గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. దోసపహాడ్ గ్రామానికే చెందిన, ప్రత్యేక తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాణాలర్పించిన కొండేటి వేణుగోపాల్ రెడ్డికి స్వయాన పెదనాన్న కుమారుడు వెంకట్ రెడ్డి. ఆయన వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశాడు. పెన్పహాడ్ మండలంలో బీఆర్ఎస్ బలోపేతానికి నిర్విరామ కృషి చేశాడు. ఆయన మృతదేహాన్ని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగంధర్, జిల్లా నాయకులు తూముల ఇంద్రసేనారావు, మిర్యాల వెంకటేశ్వర్లు. మండల నాయకులు చెన్ను ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ఎల్లావుల జగన్ సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.