WPL 2026 Auction : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ మెగా వేలంలో ప్రతిభావంతులపై కోట్లు కుమ్మరిస్తున్నాయి ఫ్రాంచైజీలు. ముఖ్యగా ఈమధ్యే ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన క్రికెటర్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నారు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన స్పిన్నర్ శ్రీ చరణి (Sree Charani) కోటి కొల్లగొట్టింది. మ్యాచ్ విన్నర్ అయిన తెలుగమ్మాయిని రూ. 1.30కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
వన్డే ప్రపంచ కప్‌లో 14 వికెట్లతో రాణించిన శ్రీ చరణి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి.. మ్యాచ్‌ను మలుపుతిప్పగల ఈ స్పిన్ సంచలనాన్ని మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరింది. గత సీజన్లో రూ.55 లక్షలకే ఈ స్పిన్నర్‌ను తీసుకున్న ఢిల్లీ ఈసారి మెగా వేలంలో రూ.1.30 కోట్లు చెల్లించేందుకు సిద్దమైంది. వరల్డ్ కప్‌లో భారత జట్టు విజయాల్లో కీలకమైన పేసర్ క్రాంతి గౌడ్ (Kranti Gaud) సైతం కోటిన్నర పలికింది.
Another big bid from the @DelhiCapitals 🔥
They bring #CWC25 winner Sree Charani onboard for INR 1.3 Crore 👏#TATAWPL | #TATAWPLAuction pic.twitter.com/2scqFWWnGu
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
RTM card in play 🔥@UPWarriorz will continue to have Kranti Gaud in their side for INR 50 Lakh! #TATAWPL | #TATAWPLAuction https://t.co/XXhQD5AWuN
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
పవర్ ప్లేలో చెలరేగిపోయే ఈ స్పీడ్‌స్టర్‌ను యూపీ వారియర్స్ ఆర్టీఎం ద్వారా రూ.50 లక్షలకు తీసుకుంది. నిరుడు ఢిల్లీకి ఆడిన రాధా యాదవ్ (Radha Yadav)ను ఈసారి మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) దక్కించుకుంది. వేలంలో ఈ ఆల్‌రౌండర్‌ను రూ.65 లక్షలకు సొంతం చేసుకుంది ఆర్సీబీ.
With an INR 65 lakh bid, #TeamIndia all-rounder Radha Yadav is now a @RCBTweets player 👏
What do you make of the addition?#TATAWPL | #TATAWPLAuction pic.twitter.com/BDgi3T0E3g
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
డబ్ల్యూపీఎల్ మూడో సీజన్లో ఆర్సీబీకి ఆడిన ఆశా శోభన వేలంలో భారీ ధర పలికింది. వికెట్ తీశాక శ్రీలంక దిగ్గజం హసరంగ స్టయిల్లో సెలబ్రేట్ చేసుకునే ఈ స్పిన్నర్‌ను యూపీ రూ.1.10కోట్లకు కొన్నది. ఇంగ్లండ్ పేసర్ లారెన్ బెల్ కూడా వేలంలో కోటికి ముందర ఆగిపోయింది. లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇరుకున పెట్టే ఈ పేస్ గన్ను ఆర్సీబీ రూ.90 లక్షలకు దక్కించుకుంది.