WPL 2026 Auction : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ మెగా వేలం ఆసక్తికరంగా సాగుతోంది. ఇటీవలే వరల్డ్ కప్‌లో అదరగొట్టిన దీప్తి శర్మ (Deepti Sharma) రూ.3.20 కోట్లు పలికింది. మ్యాచ్ విన్నర్ అయిన దీప్తిని ఆర్టీఎం(RTM) ద్వారా యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. ప్రపంచకప్‌లో రెండు శతకాలతో రెచ్చిపోయిన లారా వొల్వార్డ్త్(Lara Wolvaardt)ను రూ.1.20 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ పట్టేసింది. అయితే.. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీకి మాత్రం వేలంలో చుక్కెదురైంది. ఇప్పటివరకూ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఎవరిని కొనుగోలు చేసిందో చూద్దాం.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ వేలంలో స్టార్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. గురువారం మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత ఢిల్లీలో మెగా వేలం మొదలైంది. ఆక్షనీర్ మల్లికా సాగర్ నిర్వహిస్తున్న ఈ వేలంలో న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డెవినె(Sophie Devine) రూ.2కోట్లు పలికింది. ఆల్‌రౌండర్ అయిన డెవినె కోసం ఢిల్లీ, యూపి వారియర్స్ పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ భారీ ధరతో కివీస్ స్టార్‌ను కొన్నది.
UP Warriorz fans, welcome back @Deepti_Sharma06! 👏@UPWarriorz use the RTM card to bring back the all-rounder for INR 3.2 Crore 💰#TATAWPL | #TATAWPLAuction pic.twitter.com/f3Z1gWtgNX
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
The stylish opening batter Phoebe Litchfield will play for @UPWarriorz 💪
An INR 1.2 Crore bid for her! 👌#TATAWPL | #TATAWPLAuction pic.twitter.com/prXdCsUUuu
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
అనంతరం.. యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ ఆర్టీఎమ్ (RTM) ద్వారా దీప్తి శర్మను రూ.3.20కోట్లకు దక్కించుకుంది. ప్రపంచకప్‌లో రెండు శతకాలతో మెరిసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్త్డ్ కూడా కోటి కొల్లగొట్టింది. టాపార్డర్ బ్యాటర్ అయిన లారాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10 కోట్లకు హస్తగతం చేసుకుంది.
Major Signing! ✍️
Laura Wolvaardt goes the @DelhiCapitals way INR 1.1 Crore 💙#TATAWPL | #TATAWPLAuction pic.twitter.com/3UNP88iQ2G
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
మెగా వేలంలో భారత పేసర్ రేణుకా సింగ్ రూ.60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ గూటికి చేరింది. సెమీఫైనల్లో టీమిండియాపై సెంచరీ బాదిన ఆస్ట్రేలియా అమ్మాయి ఫొబే లిచ్‌ఫీల్డ్ రూ. 1.20 కోట్లు పలికింది. అయితే.. అలీసా హీలీ, తంజిమ్ బ్రిట్స్ వంటి స్టార్ ప్లేయర్లను ఎవరూ కొనేందుకు ఆసక్తి చూపించలేదు. గత సీజన్లో ఢిల్లీని నడిపించిన మేగ్ లానింగ్‌ను రూ.1.9కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సోఫీ ఎకిల్‌స్టోన్‌ను రూ.80 లక్షలకు యూపీ తీసుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కేర్‌ను ముంబై ఇండియన్స్ రూ.3కోట్లకు తీసుకుంది.
Amelia Kerr is back with @mipaltan 👌
The defending #TATAWPL champions bring back the highest wicket-taker from last season for INR 3 Crore 👏 #TATAWPLAuction pic.twitter.com/7xXWv96KwY
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025