బంజారాహిల్స్,నవంబర్ 27: రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న యువకులను అటకాయించి దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..వెంకటగిరిలో నివాసం ఉండే అనంద్‌కుమార్, అతడి సోదరుడు చోటూ కుమార్, ప్రహ్లాద్, సోనూకుమార్, ఆర్కే.కుమార్ తదితరులు జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని అంతేరా రెస్టారెంట్లో చెఫ్స్గా పనిచేస్తుంటారు.
బుధవారం అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని ఆనంద్‌కుమార్ తదితరులు నడుచుకుంటూ వెంకటగిరి వైపు వెళ్తున్నారు. సైలా కిచెన్‌కు సమీపంలోకి రాగానే గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు వారిని అటకాయించడంతో పాటు అకారణంగా దాడికి పాల్పడ్డారు. దుండగుల్లో ఒకరు చోటూకుమార్ తలపై పైప్‌తో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఆనంద్‌కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.