హనుమకొండ చౌరస్తా : కాకతీయ విశ్వవిద్యాలయం( Kakatiya University) కామన్ మెస్‌లో విద్యార్థులకు పురుగుల టిఫిన్ పెట్టడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆదివారం ఉదయం ఉప్మా (నాటు రవ్వ) లో పురుగులు (Worms) రావడంతో విద్యార్థులు ఆందోళనకు (Students protest) దిగారు. హాస్టల్ డైరెక్టర్‌ను తొలిగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు.
వర్సిటీ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో హాస్టల్ డైరెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన టిఫిన్, భోజనం అందించడంలేదని ఆందోళనకు దిగారు. గతంలో కూడా నాసిరకం భోజనం పెడుతున్నారని, ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారు, మెనూ పాటించడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతవిద్య కోసం కాకతీయ యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులు తిండి కోసం ఇబ్బందులు తప్పడంలేదని, ఇప్పటికైనా యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరారు.