ములుగు : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడుగడుగునా నిలదీతలు ఎదురవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ( Panchyat Elections ) సందర్భంగా ప్రచారానికి వచ్చిన అధికార పార్టీ నాయకులు సమాదానం చెప్పలేక వెనుదిరుగుతున్నారు.
తాజాగా ములుగు జిల్లా ( Mulugu Distirct ) ఏటూరునాగారం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క ( Minister Seethakka ) కు చుక్కెదురయ్యింది. తమకు ఇందిరమ్మ ఇళ్లను ఎందుకు కేటాయించలేదని స్థానికులు మంత్రిని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కన పెట్టి, స్థానిక ఎన్నికల కోసం కొత్తగా వెయ్యి ఇళ్లు ఇస్తామనే ఊహకందని హామీలు ఇస్తూ కొత్త నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. సీతక్క మంత్రిగా రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలపాలని డిమాండ్ చేశారు.