Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు నాడు చేసిన సాయంతో ఓ యువతి నేడు డాక్టర్ అయ్యింది. ఈ విషయాన్ని హరీశ్‌రావుకు చెప్పడానికి దాదాపు 20 కి.మీ. ఆయన కారును చేజ్ చేసి వెళ్లి మరీ తన ఆనందాన్ని పంచుకుంది. “మీ వల్లే డాక్టర్ అయ్యాను సార్” అంటూ ఈ చెల్లి కన్నీళ్లతో చెప్పిన మాటలకు హరీశ్ అన్న చలించిపోయారు. కారు దిగి, ఆప్యాయంగా పలకరించి, ఆమె భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని దీవించారు.
పదవులు శాశ్వతం కాదు.. మనం చేసే పనులే శాశ్వతం అని ఈ సంఘటనతో హరీశ్‌రావు నిరూపించారని ప్రజలు చెప్పుకుంటున్నారు. సాయం చేసి మర్చిపోవచ్చు కానీ ఆ సాయాన్ని పొందిన ఈ అమ్మాయి హరీశ్ రావు గారిని గుర్తుపెట్టుకుని మరీ 20 కిలోమీటర్లు కారులో ఛేజ్ చేసి అన్నను కలిసి కృతజ్ఞతలు చెప్పడం రాజకీయాలకు అతీతమైన ఒక మానవీయ బంధానికి నిలువెత్తు సాక్ష్యమని కొనియాడుతున్నారు. ఇవాళ గెలిచింది కేవలం ఆ వైద్య విద్యార్థిని మాత్రమే కాదు.. నమ్ముకున్న వారికి అండగా నిలిచిన హరీశ్ రావు గారి వ్యక్తిత్వం కూడా గెలిచిందని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి
హరీశ్ రావు గారు నాడు చేసిన సాయం..
నేడు సమాజానికి ఒక డాక్టర్ ను అందించింది.“మీ వల్లే డాక్టర్ అయ్యాను సార్” అంటూ ఈ చెల్లి కన్నీళ్లతో చెప్పిన మాటలకు హరీశ్ అన్న చలించిపోయారు.
కారు దిగి, ఆప్యాయంగా పలకరించి, ఆమె భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని దీవించారు.
పదవులు శాశ్వతం కాదు..… pic.twitter.com/x7x8PMUlCp
— Office of Harish Rao (@HarishRaoOffice) December 7, 2025