CM Revanth Reddy | దేవరకొండ పట్టణంలో ప్రజా పాలన విజయోత్సవాల బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి బీసీ రిజర్వేషన్ల కోసం అమరుడైన సాయి ఈశ్వర చారికి శ్రద్ధాంజలి ఘటించకుండా, కనీసం మౌనం కూడా పాటించకుండా, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు 42 శాతం రిజర్వేషన్‌పై మాట ఎత్తకుండా మోసం చేస్తూ మాయమాటలు చెప్పి ప్రజా దుర్వినియోగం చేశారని సామాజికవేత్త, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
ఈ విషయమై చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి బహిరంగ లేఖలో బీసీ ,ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ గురుకులాలకు, బీసీ ,ఎస్సీ ,ఎస్టీ సంక్షేమ హాస్టల్లకు సొంత భవన నిర్మాణాలు, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్నటువంటి 6,500 కోట్ల బకాయిలు ,మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలను ప్రకటించకుండా మాయమాటలతోటి మరోసారి బీసీలను మోసం చేసినటువంటి కుట్ర చేస్తూ.. దేవరకొండ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా ప్రజల యొక్క నిధులను దుర్వినియోగం చేసి పార్టీ సభగా మార్చుకొని మరోసారి మోసం చేసి వెళ్లిపోయడం జరిగిందన్నారు. ఈ విధంగా చేస్తే బీసీలు , బహుజన కులాలు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పున్న వెంకటేశం, నేత పెరికీటి శ్రీనివాస్ చారి, శివ గౌడ్, లౌడ్య భాష నాయక్, మాకం చంద్రమౌళి, ఎండి ఖాదర్ బాబా,శివ తదితరులు పాల్గొన్నారు.
ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు