Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు
Hyderabad | అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక ఓ కుటుంబం మూడు రోజులు మృతదేహంతో నివసించింది. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు జరిపించారు.
జీడిమెట్ల : అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక ఓ కుటుంబం మూడు రోజులు మృతదేహంతో నివసించింది. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు జరిపించారు. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోగల షాపూర్‌నగర్ సమీపంలో ఎన్ఎల్‌బీనగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 76 ఏళ్ల స్వామిదాస్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్నాడు. ఆయన చిన్న కూతురు సలోని కుటుంబ పోషణ కోసం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్ ఉద్యోగం చేసేది. ఈ క్రమంలో తన తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో ఉద్యోగం మానేసింది. స్వామిదాస్ ఆరోగ్య పరిస్థితి విషమించి మూడు రోజుల క్రితం మరణించాడు.
అయితే అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేవని ఆ కుటుంబం మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని నివసించింది. మూడు రోజులుగా ఇంట్లోంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆపై స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు జరిపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

