కేకేఆర్ చేతికి మెడికవర్
అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ చేతికి మరో హాస్పిటల్ చేరింది. హైదరాబాద్ కేం ద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న మెడికవర్ ఇండియా యూనిట్‌ను హస్తగతం చేసుకోబోతున్నది.
న్యూఢిల్లీ, ఆగస్టు 6: అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ చేతికి మరో హాస్పిటల్ చేరింది. హైదరాబాద్ కేం ద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న మెడికవర్ ఇండియా యూనిట్‌ను హస్తగతం చేసుకోబోతున్నది. ఒప్పం దం విలువ మాత్రం కేకేఆర్ వెల్లడించలేదు.
ప్రస్తుతం మెడికవర్ ఇండియా విలువ 1.2 బిలియన్ల యూరోలు. 2017లో ప్రారంభమైన మెడికవర్ హాస్పిటల్.. దేశవ్యాప్తంగా 24 దవాఖానల్లో 4,800 పడకలను నిర్వహిస్తున్నది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఈ పెట్టుబడులు పెట్టినట్టు, దీంతో మెడికవర్ ఇండియా డాక్టర్లు, ఉద్యోగులకు మరింత లాభదాయకంగా ఉంటుందని కేకేఆర్ ఇండియా హెడ్ అక్షయ్ తన్నా తెలిపా రు. మెడికవర్ ఇండియాలో 80 క్లినికల్ స్పెషాల్టీలు, 1,900 మంది డాక్టర్లు, అడ్వాన్స్డ్ క్లినికల్ మౌలిక సదుపాయాల టెక్నాలజీ ఉన్నది. దేశీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు దీర్ఘకాలిక అభివృద్ధిపై తమకున్న నమ్మకానికి ఈ పెట్టుబడులు నిదర్శనమన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- India
- KKR
- Medicover
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

