హనుమకొండ చౌరస్తా : చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరీ ( Rudreshwari) -రుద్రేశ్వరస్వామి (Rudreshwara Swamy) వార్లకు వాహనసేవ (Vahanaseva) నిర్వహించారు. ఆరుద్రనక్షత్రం మహాశివరాత్రితో సమానమైనదని, బ్రహ్మ,విష్ణువు మధ్య సంగ్రామం జరిగినప్పుడు శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భమైన రోజు అభిషేకం చేయడం వలన విశేష ఫలితం లభిస్తుందన్న నమ్మకంతో ఉదయం 5 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా 121 మంది దంపతులు రుద్రాభిషేకం నిర్వహించారు.
ఉత్తరద్వారం నుంచి దక్షణద్వారం వరకు మేళతాళాలతో ఢమరుక వాయిద్యాలతో రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామివార్లను మంగళహారతుల మధ్య బృంగివాహన సేవ భక్తులు స్వామివార్ల వాహనసేవను అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు.
ఈ వాహనసేవలో ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, మణికంఠశర్మ, ప్రణవ్, శ్రవణ్, ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమాదేవి దంపతులు, వరంగల్ ప్రధాన న్యాయమూర్తి బంధువులు, న్యాయవాదులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.