అభ్యాసం, అంకితభావం ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు. కష్టతరమైన పనులను కూడా ఉపాయంతో గట్టెక్కవచ్చు. మహిళలు బైకులు నడపడం ఇంకా కనిపించని ఈరోజుల్లో.. ఒక మహిళ తన తలపై సామగ్రి పెట్టుకుని బైక్‌పై సర్కస్ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్ను ఆశ్చర్యపరుస్తున్నది. వీక్షకులు ఆమెను ‘సూపర్ వుమన్’ ‘వండర్ ఉమెన్’ అని పిలుస్తారు. డాక్టర్ అజైత అనే ట్విట్టర్ యూజర్ ఈ మహిళ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీడియోలో ఒక మహిళ తన తలపై పాత్రలతో నిండిన తొట్టెను పెట్టుకొని ఒక చేతిలో బకెట్, మరో చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని ఉండి బైకు నడుపుతూ నీటి కాలువను ఎలాంటి జంకు లేకుండా దాటింది. ఈ వీడియోకు ”బహుళ ప్రతిభ” అనే శీర్షికతో డాక్టర్ అజైత పోస్ట్ చేశారు. 41 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఒక్క రోజులో 88 వేలకు పైగా ప్రజలు వీక్షించారు.
ఆమె బైకును బ్యాలెన్సింగ్ చేసే విధానంతో వారు ముగ్ధులయ్యారు. అద్భుతమైన ప్రతిభ అంటూ చాలా మంది నెటిజెన్లు కీర్తించారు. కొంతమంది యూజర్లు.. మహిళలు ఏదైనా చేయగలరని వ్యాఖ్యానించగా.. మరికొందరు దీనిని మహిళా సాధికారతకు అద్భుతమైన ఉదాహరణ అని రాశారు.
సింహాలతో కొట్లాడి పిల్లను దక్కించుకున్న బర్రె.. వీడియో వైరల్
చంపత్రాయ్ను తొలగించాల్సిందే : స్వామి స్వరూపానంద సరస్వతి
బ్లాక్ గేమ్స్ రొచ్చు : హనీట్రాప్‌లో రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు
ఫైనల్‌కు ముందు వివాదం : బయో బబుల్‌ను వీడిన కివీస్ ఆటగాళ్లు
గంగానదిలో పెట్టె.. పెట్టెలో దేవతల మధ్య చిన్నారి..
డబ్ల్యూటీసీ ఫైనల్ : ఒక్క మ్యాచ్‌తో విజేతను నిర్ణయించడం సరికాదు : సచిన్
చరిత్రలో ఈరోజు : అంతరిక్షంలోకి వాలెంటినా
కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..