చరిత్రలో ఈరోజు : అంతరిక్షంలోకి వాలెంటినా
సోవియట్ యూనియన్‌కు చెందిన వాలెంటినా తెరిష్కోవా.. 1963 లో సరిగ్గా ఇదే రోజున అంతరిక్షానికి ప్రయాణమైంది. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మహిళగా వాలెంటినా రికార్డు సృష్టించారు.

సోవియట్ యూనియన్‌కు చెందిన వాలెంటినా తెరిష్కోవా.. 1963 లో సరిగ్గా ఇదే రోజున అంతరిక్షానికి ప్రయాణమైంది. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మహిళగా వాలెంటినా రికార్డు సృష్టించారు. వోస్టాక్ -6 అంతరిక్ష నౌక ద్వారా ఆమె అంతరిక్షంలోకి వెళ్లింది. దాదాపు 3 రోజుల తర్వాత విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది. ఆమె పేరిట రెండు రికార్డులు ఉన్నాయి. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళగా నిలువడమే కాకుండా.. దాదాపు 71 గంటలు అంతరిక్షంలో ఉన్న మహిళగా కూడా పేరు గడించారు.
అంతరిక్షంలోకి ఈసారి మహిళను పంపాలని సోవియట్ యూనియన్ అన్వేషన ప్రారంభించింది. ఏదో తమాషాగా వాలెంటినా కూడా దరఖాస్తు పంపింది. అయితే, 400 మంది దరఖాస్తు చేసుకోగా.. వాలెంటినాతోపాటు మరో నలుగురు ఈ మిషన్‌కు ఎంపికయ్యారు. 18 నెలల పాటు కఠిన శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం వారిని అంతరిక్షంలోకి పంపే ఏర్పాటు చేశారు. భూ కక్ష్యలో 48 రౌండ్లు చేసిన అనంతరం జూన్ 19 న 71 గంటల తర్వాత భూమికి తిరిగి వచ్చింది. భూమి ఉపరితలం నుంచి 20 వేల అడుగుల ఎత్తు నుంచి దూకవలసి వచ్చింది. గతంలో పారాచూట్‌తో దూకిన అనుభవం వాలెంటినాకు ఎంతగానో కలిసివచ్చింది. కేవలం 26 సంవత్సరాల వయస్సులో అంతరిక్షం నుంచి విజయవంతంగా తిరిగి రావడం ద్వారా వాలెంటినా చరిత్ర సృష్టించింది. ఆమె సేవలకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ లెనిన్, హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2012: షెన్‌జౌ -9 అంతరిక్ష నౌక ద్వారా తొలి మహిళగా లియు యాంగ్‌ను అంతరిక్షంలోకి పంపిన చైనా
2009: ముంబై ఉగ్ర దాడి తర్వాత తొలిసారి పాకిస్తాన్ అధ్యక్షుడిని కలిసిన భారత ప్రధాని మన్మోహన్ సింగ్
1911: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (ఐబిఎం) ప్రారంభం
1903: కొద్ది మందితో కలిసి ఫోర్డ్ మోటార్ కంపెనీని స్థాపించిన హెన్రీ ఫోర్డ్
1884: అమెరికాలోని బ్రూక్లిన్‌లో మొదటి రోలర్ కోస్టర్ ప్రారంభం
ఇవి కూడా చదవండి..
ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత సులువు
ఆన్-సైట్ : వ్యాక్సిన్ డోసుకు ప్రీ-రిజిస్ట్రేషన్ అక్కర్లేదు
క్లాట్ 2021 : పరీక్ష తేదీని ప్రకటించిన కన్సార్టియం
కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
గోర్లను చూసి డయాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

