బ్లాక్ గేమ్స్ రొచ్చు : హనీట్రాప్‌లో రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు
లాక్డౌన్ నేపథ్యంలో కొత్త కొత్త నేరాలు కనిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా హనీట్రాప్ అనే బ్లాక్ గేమ్ ఒకటి. ఈ కూపంలో చిక్కుకున్న పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు కోట్లు కోల్పోయారు. లాక్డౌన్ సమయంలో ఇంటి కేసులు వందల్లో వెలుగులోకి వస్తున్నాయి

ముంబై : లాక్డౌన్ నేపథ్యంలో కొత్త కొత్త నేరాలు కనిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా హనీట్రాప్ అనే బ్లాక్ గేమ్ ఒకటి. ఈ కూపంలో చిక్కుకున్న పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు కోట్లు కోల్పోయారు. లాక్డౌన్ సమయంలో ఇంటి కేసులు వందల్లో వెలుగులోకి వస్తున్నాయి. పరువు పోతుందన్న భయంతో చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు.
హలో అంటూ ఒక అమ్మాయి తీయగా మాట్లాడే సరికి ఓ రాజకీయ నాయకుడు మాట కలిపాడు. స్నేహంతో ప్రారంభమై వారు ప్రేమలో పడిపోయారు. ప్రేమ పేరుతో సదరు యువతి ఆ నాయకుడితో అశ్లీలంగా ఉండి మాట్లాడటం, కుళ్లు జోకులు వేసుకుంటూ బూతులు మాట్లాడటాన్ని యువతికి చెందిన వారే రికార్డ్ చేసి సదరు నాయకుడిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. వారు చెప్పినట్లు లక్ష వరకు ముట్టజెప్పాడు. ఇక బయటపడటం తన వల్ల కాదని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఇలా హనిట్రాప్ ముఠా బ్లాక్ మెయిలింగ్‌కు గురైన ఈయనొక్కడే కాదు. మరెందరో ఉన్నారు. పారిశ్రామికవేత్తలు, ఐటీ ఉద్యోగులు వీరి వలకు చిక్కుకుని లక్షలు కోల్పోయారు.
దేశవ్యాప్తంగా ఇలాంటి రొచ్చు వ్యాపారం బాగానే జరిగినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు అందుతున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తున్నది. రాజస్థాన్ మొదలుకొని కేరళ వరకు ఎందరో హనిట్రాప్ ఉచ్చుకు చిక్కి విలవిల్లాడారు. సోషల్ మీడియాలో తెలియని అభ్యర్థనలను అంగీకరించవద్దని, ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లయితే వెంటనే ఫిర్యాదు చేయాలని అన్ని రాష్ట్రాల పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నా.. అమ్మాయిల ఫోన్ కాల్ అనేసరికి అన్నీ మరిచిపోయి మరో బకరాగా మారుతున్నారు. దాంతో ఈ బ్లాక్ గేమ్స్ రొచ్చు మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. అదేవిధంగా మోసపోతున్నవారు గొప్పింటివారు కావడం, సమాజంలో పేరున్నవారు కావడం వల్ల.. పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. వీరి భయం బ్లాక్గేమ్స్ ఆడేవాళ్లకు వరంగా మారుతున్నది.
ఇవి కూడా చదవండి..
ఫైనల్‌కు ముందు వివాదం : బయో బబుల్‌ను వీడిన కివీస్ ఆటగాళ్లు
గంగానదిలో పెట్టె.. పెట్టెలో దేవతల మధ్య చిన్నారి..
డబ్ల్యూటీసీ ఫైనల్ : ఒక్క మ్యాచ్‌తో విజేతను నిర్ణయించడం సరికాదు : సచిన్
చరిత్రలో ఈరోజు : అంతరిక్షంలోకి వాలెంటినా
ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత సులువు
ఆన్-సైట్ : వ్యాక్సిన్ డోసుకు ప్రీ-రిజిస్ట్రేషన్ అక్కర్లేదు
క్లాట్ 2021 : పరీక్ష తేదీని ప్రకటించిన కన్సార్టియం
కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

