తాంసి(భీంపూర్), సెప్టెంబర్ 19 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని కరంజి(టీ)లో బీఆర్ఎస్ సర్కారు హయాంలో కేసీఆర్ కాలనీలో 40 బెడ్ రూమ్ ఇండ్లున్న ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం కాలనీని అధికారులు, నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. కొన్ని నెలలుగా ఉంటున్న తమకు ఇండ్లు సౌకర్యవంతంగా ఉన్నాయని లబ్ధిదారులు ఎమ్మెల్యేతో తమ ఆనందం పంచుకున్నారు. కాలనీలో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని, ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తామని లబ్ధిదారులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేలను మహిళా లబ్ధిదారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శివరాం, కార్యదర్శులు వినోద్, లోకేశ్, నాయకులు మేకల నాగయ్య, కుమ్ర సుధాకర్, గడ్డం లస్మన్న, నరేందర్ యాదవ్, కేమ శ్రీకాంత్, ఏనుగు వంశీరెడ్డి, అశోక్ రెడ్డి, అనిల్, కల్చప్ యాదవ్, నరేందర్ రెడ్డి, కపిల్, అశోక్, వినోద్ పాల్గొన్నారు.
గ్రామాల్లో ప్రజలు ఆరోగ్య కేంద్రాలను సద్వినియోగించుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. తాంసి, భీంపూర్ మం డలాల్లో ఎమ్మెల్యే శుక్రవారం ఎంపీ గొడం నగేశ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో మంజూరై నిర్మాణాలు పూర్తయిన తాంసి, భీంపూర్, కరంజి(టీ) ఆరోగ్య ఉప కేంద్రాలు (వెల్నెస్ సెంటర్లు) ప్రారంభించారు. మర్కాగూడలో పంచాయతీ భవనం ప్రారంభించారు. పీవీటీజీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పత్రాలు అందజేశారు. ఈ ప్రాంత అభివృద్ధి బీఆర్ఎస్ సర్కారు ఎంతో కృషి చేసిందని తెలిపారు.
నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి కార్యాలయాలు నిర్మించారని తెలిపారు. కరంజి(టీ), గుబిడి రోడ్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాలలతో పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో బీఆర్ఎస్ కన్వీనర్ మేకల నాగయ్య, మాజీ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఆత్మ చైర్మన్ అశోక్, నాయకులు గడ్డం లస్మన్న, నరేందర్, కేమ శ్రీకాంత్, కృష్ణ, రమణ, రఘు, ఎం.కల్చాప్ యాదవ్, ఆకటి నరేందర్ రెడ్డి, కపిల్, నితిన్, దేవారెడ్డి, రమేశ్, శ్రీధర్ రెడ్డి, జహుర్ అహ్మద్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డాక్టర్ నిఖిల్ రాజ్, గోపాలకృష్ణ రెడ్డి, మోహన్ రెడ్డి, తహసీల్దార్లు నలందప్రియ, లక్ష్మి, డీఈ శివరాం, కార్యదర్శులు వినోద్, లోకేశ్, నర్సయ్య, రమేశ్, దేవారెడ్డి, నారాయణరావు, అశోక్, సాయినాథ్, మహేందర్ పాల్గొన్నారు.