తాండూర్ సెప్టెంబర్ 19 : రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఎ. రాజ్ కుమార్ (Raj Kumar) ఎంపికయ్యాడు. ‘సాధన స్పోర్ట్స్ అకాడమీ’ ఆధ్వర్యంలో గురువారం 35వ సబ్ జూనియర్ కబడ్డీ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 10 వ తరగతి చదువుతున్న రాజ్ కుమార్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. తద్వారా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అతడు అర్హత సాధించాడని పీడీఏ సాంబమూర్తి తెలిపారు.
సెప్టెంబర్ 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లా ముప్కల్ గ్రామంలో జరుగబోయే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో మంచిర్యాల జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు రాజ్ కుమార్. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన అతడిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.ఉమాదేవి, ఉపాధ్యాయులు డి.రాజేశ్వరరావు, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్, హరిప్రసాద్, భాస్కర్, రవి, అంజిరెడ్డి, కె. శ్రీనివాస్, సురేందర్, డి. శ్రీనివాస్, ఏఏపీసీ చైర్మన్ చిలకమ్మ, గ్రామ పెద్దలు అభినందించారు.