Delivery Agent | ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్ డెలివరీలు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరూ తమ బిజీ లైఫ్‌లో షాప్‌కు వెళ్లి కొనకుండా.. ఈజీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నారు. పాల నుంచి కూరగాయలు, నిత్యావసర సరకులు, ఫుడ్ ఇలా ఒకటేంటి ఇంట్లోకి కావల్సిన వస్తువులన్నింటినీ జెప్టో, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటున్నారు.
ఆర్డర్ పెట్టిన పది నిమిషాల్లోనే వస్తువులు డోర్ డెలివరీ అవుతుండటంతో అందరూ వీటికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే, సాధారణంగా డెలివరీ ఏజెంట్లు (Delivery Agent) ద్విచక్ర వాహనాలపై వస్తువులను కస్టమర్లకు టైమ్‌కు డెలివరీ చేస్తుంటారు. ఎక్కువ వస్తువులైతే సరకు రవాణా చేసే ఆటోల్లో తీసుకెళ్తుండటం మనం చూశాం. కానీ ఓ డెలివరీ ఏజెంట్ ఏకంగా రూ.లక్షలు విలువ చేసే థార్ కారులో కస్టమర్ ఇంటికి వెళ్లి ఆర్డర్ డెలివరీ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
బ్లింకిట్‌కు చెందిన ఓ డెలివరీ ఏజెంట్ (Blinkit Delivery Agent) థార్ (Thar) కారులో కస్టమర్ ఇంటికి వెళ్లి గ్రాసరీస్ డెలివరీ చేశాడు. దీంతో సదరు కస్టమర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఏంటీ.. థార్ కారులో వచ్చి వస్తువులు కస్టమర్లకు అందించారా..?’ అంటూ అవాక్కవుతున్నారు. మరికొందరైతే ‘డెలివరీ బాయ్స్‌కి నిజంగానే కార్లల్లో వెళ్లి డెలివరీ చేసే అంత డబ్బు చెల్లిస్తారా..?’ లేదంటే ‘డెలివరీ బాయ్స్‌కి థార్ కార్లను తక్కువ ధరకు విక్రయిస్తున్నారా..?’ అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 4 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.
Also Read..
Pak-Saudi defence pact | పాక్-సౌదీ మధ్య కీలక రక్షణ ఒప్పందం.. భారత్ ఏమన్నదంటే..?
Burj Khalifa | బుర్జ్ ఖలీఫాపై మెరిసిన ప్రధాని మోదీ.. ఆకట్టుకుంటున్న వీడియో