Burj Khalifa | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్ (Dubai)లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa). ప్రత్యేక సందర్భాల్లో ఈ కట్టడం ఎల్ఈడీ స్క్రీన్‌తో ప్రత్యేక థీమ్‌ను ప్రదర్శిస్తుంది. తాజాగా ఆ ఎత్తైన భవనంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మెరిశారు.
ప్రధాని మోదీ 75వ పుట్టిన రోజును బుధవారం ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులతోపాటూ పలు దేశాధినేతలు ప్రధానికి ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ప్రధాని మోదీ, భారత్‌తో తమకున్న అనుబంధాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలతో బుర్జ్ ఖలీఫా వెలుగులీనింది. ప్రధాని చిత్రంతోపాటూ, జాతీయ జెండాను కూడా ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బుర్జ్ ఖలీఫా అధికారిక ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
#WATCH | Dubai’s Burj Khalifa illuminated tonight with the images of PM Narendra Modi, on the occasion of his 75th birthday. pic.twitter.com/gamw6cRaoq
— ANI (@ANI) September 17, 2025
Also Read..
Cloudburst | ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌బరస్ట్.. 10 మంది గల్లంతు
Abdul Gani Bhat | హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చీఫ్ అబ్దుల్ గనీ భట్ మృతి
PM Modi | ప్రధాని మోదీకి బర్త్‌డే గిఫ్ట్ పంపిన బ్రిటన్ రాజు.. ఏమిచ్చారో తెలుసా?