Cloudburst | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోన్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన వర్షాలు, వరదలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పుడు తాజాగా అక్కడ మరోసారి వర్షం బీభత్సం సృష్టించింది.
#WATCH | Uttarakhand | Chamoli District Magistrate Sandeep Tiwari told ANI, “A cloudburst caused damage in the Nandanagar Ghat area of Chamoli district on Wednesday night. Six houses were buried under debris in the Kuntri Langafali ward of Nandanagar. The District Magistrate… pic.twitter.com/oNWiRwzxYw
— ANI (@ANI) September 18, 2025
చమోలి (Chamoli) జిల్లాలోని నందా నగర్లో బుధవారం రాత్రి మేఘవిస్ఫోటనం (Cloudburst) కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదలకు 10 మంది గల్లంతయ్యారు. గల్లంతైన 10 మందిలో కుంత్రి లగా ఫాలి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు, సర్పానికి చెందిన వారు ఇద్దరు, దుర్మా ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇక ఈ వరదలకు ఆరు భవనాలు కొట్టుకుపోయాయి (houses washed away). రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించింది. ఆ ప్రాంతంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతోంది. కాగా, రెండు రోజుల క్రితం రాజధాని డెహ్రాడూన్ (Dehradun)లో క్లౌడ్‌బరస్ట్ కారణంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదలకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు.
#WATCH | Uttarakhand | Six buildings were destroyed by debris due to a cloudburst and heavy rain in the Kuntri Lagafali ward of Nandanagar, Chamoli. The Chamoli district administration has intensified relief and rescue operations at the site. Panic gripped the area, fear gripped… pic.twitter.com/s8UC5k76dO
— ANI (@ANI) September 18, 2025
Also Read..
Abdul Gani Bhat | హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చీఫ్ అబ్దుల్ గనీ భట్ మృతి
PM Modi | ప్రధాని మోదీకి బర్త్‌డే గిఫ్ట్ పంపిన బ్రిటన్ రాజు.. ఏమిచ్చారో తెలుసా?
టాప్ 100 బీ-స్కూల్స్‌లో మూడు ఐఐఎంలు