న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్ 100 బిజినెస్ స్కూల్స్‌లో మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు చోటు దక్కింది. క్యూఎస్ గ్లోబల్ ఎంబీఏ, ఆన్లైన్ ఎంబీఏ, బిజినెస్ మాస్టర్స్ ర్యాంకింగ్స్, 2026ను లండన్ కేంద్రంగా పని చేస్తున్న క్యూఎస్ విడుదల చేసింది. ఐఐఎం బెంగళూరు నిరుటి కన్నా ఒక స్థానం ఎగబాకి 52వ స్థానానికి చేరింది. ఐఐఎం అహ్మదాబాద్ రెండు స్థానాలను ఎగబాకి 58వ స్థానానికి, ఐఐఎం కలకత్తా ఒక స్థానం ఎగబాకి 64వ స్థానానికి చేరాయి. ఎంప్లాయబిలిటీ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, థాట్ లీడర్షిప్ ఇండికేటర్స్‌లో పటిష్టమైన స్కోర్లు సాధించడంతో ఈ విజయం లభించిందని క్యూఎస్ ఓ ప్రకటనలో తెలిపింది.