శ్రీనగర్: కశ్మీర్ వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చైర్మన్ అబ్దుల్ గనీ భట్ (Abdul Gani Bhat) మరణించారు. 90 ఏండ్ల గనీ.. గత రెండేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్ధాప్యం కారణంగా బారాముల్లాలోని సోపోర్‌లోని ఇంటికే పరిమితమైన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంతో, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌తో హురియత్ కాన్ఫరెన్స్ (Hurriyat Conference) చర్చలు జరపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అబ్దుల్ గనీ మృతిపట్ల జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ రాజకీయ సిద్ధాంతాలు వేరైనప్పటికీ, ఎప్పుడూ మర్యాదపూర్వంగానే నడుచుకునేవారని చెప్పారు. సీనియర్ కశ్మీర్ రాజకీయ నాయకుడు, విద్యావేత్త అయిన ప్రొఫెసర్ గనీ మరణ వార్త విని బాధపడ్డానని ఎక్స్ వేదికగా వెల్లడించారు.