న్యూఢిల్లీ: ప్రధాని మోదీ 75వ జన్మదినోత్సవ వేడుకలను (PM Modi) దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, వివిధ దేశాధినేతలు, ప్రముఖులు ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రధాని మోదీకి బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-౩ (King Charles 3) ఓ విశిష్ట బహుమతి (Birthday Gift) అందించారు. బర్త్‌డే గిఫ్ట్‌గా కదంబ చెట్టును (Kadamb Tree) పంపించారు. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ ఆ చెట్టును ప్రధాని మోదీకి అందజేసింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది..
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఆయనకోసం కదంబ చెట్టును పంపించారు. ‘అమ్మ పేరుతో మొక్కను నాటండి’ అని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఈ బహుమతి పంపించారు. దీంతో పర్యవరణ పరిరక్షణకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని పేర్కొంటూ ట్వీట్ బ్రిటిష్ హై కమిషన్ పోస్టు చేసింది.
His Majesty The King has been graciously pleased to send a Kadamb tree to India’s Prime Minister Narendra Modi on his birthday.
The gesture, inspired by PM Modi’s ‘Ek Ped Maa Ke Naam’ initiative, reflects their shared commitment to environmental conservation. pic.twitter.com/3KI01QB3Ys
— UK in India🇬🇧🇮🇳 (@UKinIndia) September 17, 2025