Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యూకే పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ (Air Force One) సమీపంలోకి ప్రయాణికుల విమానం దూసుకొచ్చింది. ఈ ఘటన లాంగ్ ఐలాండ్ గగనతలంలో చోటు చేసుకుంది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, ఫస్ట్‌లేడీ మెలానియా ట్రంప్ (Melania Trump) యూకే పర్యటనకు వెళ్లారు. ట్రంప్ దంపతులు ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానం లాంగ్ ఐలాండ్ (Long Island) వద్ద గగనతలంలో ఉన్నప్పుడు స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం (Spirit Airlines jet) అతి సమీపంలోకి వచ్చింది. ఇది గమనించిన న్యూయార్క్ టవర్ కంట్రోలర్ సిబ్బంది స్పిరిట్ ఎయిర్‌లైన్స్ పైలట్స్‌కు హెచ్చరికలు పంపారు. విమానాన్ని కుడివైపుకు మళ్లించాలంటూ హెచ్చరించారు.
పలుమార్లు హెచ్చరించినా పైలట్లు పట్టించుకోలేదు. దీనిపై టవర్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శ్రద్ధ వహించండి.. ఐప్యాడ్ నుంచి బయటకిరండి..’ అంటూ పైలట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రమత్తమైన పైలట్లు విమానా దిశను మార్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనపై స్పిరిట్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఆ సమయంలో తమ ఎయిర్‌బస్ A321 స్పిరిట్ ఫ్లైట్ లాంగ్ ఐలాండ్ మీదుగా ఫోర్ట్ లాడర్డేల్ నుంచి బోస్టన్‌కు వెళ్తున్నట్లు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇచ్చిన అన్ని ఆదేశాలను పాటించినట్లు పేర్కొంది. అనంతరం సేఫ్‌గా గమ్యస్థానానికి చేరుకున్నట్లు వెల్లడించింది.
Also Read..
Pennsylvania Shooting | అమెరికాలో కాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి
అబుదాబిలో తొలి డ్రైవర్‌లెస్ డెలివరీ వాహనం
డ్రగ్స్ సరఫరాదారుగా భారత్‌పై ముద్ర !