Pennsylvania Shooting | అమెరికాలో కాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పెన్సిల్వేనియాలోని (Pennsylvania) ఉత్తర కొడోరస్ టౌన్షిప్లో పోలీసులే లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పెన్సిల్వేనియాలోని (Pennsylvania) ఉత్తర కొడోరస్ టౌన్షిప్లో పోలీసులే లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ముగ్గురు పోలీసు అధికారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే పోలీసుల కాల్పుల్లో దుండగుడు కూడా హతమయ్యాడని అధికారులు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని పెన్సిల్వేనియా స్టేట్ పోలీస్ కమిషనర్ క్రిస్టొఫర్ పారిస్ తెలిపారు.
కాల్పుల ఘటనపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షపిరో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ దేశం, కౌంటీ కోసం పనిచేసిన అత్యంత విలువైన అధికారులను కోల్పోయామన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు సహేతుకం కాదని చెప్పారు. ఇంకా మెరుగైన సమాజం కోసం అంతా కలిసి పనిచేద్దామని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

