Bomb threat : ఈ మధ్యకాలంలో ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు ఇలా అన్నింటికి బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ల ద్వారా, ఈ మెయిల్ల ద్వారా ఇలాంటి బెదిరింపు సందేశాలు పంపుతున్నారు. తాజాగా గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) కు ఇలాంటి బెదిరింపు మెయిల్ వచ్చింది.
గుజరాత్ హైకోర్టులో బాంబు పెట్టామంటూ ఈ మెయిల్ ద్వారా సంబంధిత అధికారులకు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో అహ్మదాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్‌తో హైకోర్టుకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు అహ్మదాబాద్ డిప్యూటీ కమిషనర్ సఫిన్ హసన్ తెలిపారు. బెదిరింపు మెయిల్ పంపిన దుండగుడిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Ahmedabad, Gujarat: Following the bomb threat, police have increased security checks significantly around the Gujarat High Court pic.twitter.com/sLTkToeTFz
— IANS (@ians_india) June 9, 2025