బెంగుళూరు: కర్నాటకలోని బెంగుళూరు హోటల్ రూమ్లో ఓ మహిళను హత్య చేశాడు ఆమె లవర్. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే రెండు రోజుల తర్వాత ఆ మర్డర్ వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని 33 ఏళ్ల హరినిగా, నిందితుడిని 25 ఏళ్ల టెకీ యాసాస్గా గుర్తించారు. ఈ ఇద్దరూ బెంగుళూరు శివారు ప్రాంతం కెన్గిరికి చెందినవాళ్లు. పూర్ణ ప్రజ్ఞా లేఔట్లో ఉన్న ఓయో హోటల్ రూమ్లో మర్డర్ జరిగింది. హరినిని నిందితుడు కత్తితో పొడిచి చంపాడు. సుబ్రమణ్యపుర పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతోంది.
ఇద్దరి మధ్య రెండు నెలల నుంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రెండ్షిప్ను వదులుకోవాలని ఆ మహిళ చూస్తోంది. దీంతో అతన్ని దూరం పెట్టింది. ఆ కోపంతోనే మహిళను కత్తితో పొడిచి చంపినట్లు డీసీపీ లోకేశ్ జగలాసర్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశారు. హరినికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడు 17 సార్లు కత్తితో పొడిచినట్లు పోలీసులు వెల్లడించారు.