Chalo Hyderabad | గుండాల, ఫిబ్రవరి 18 : కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ గుండాల మండలం శెట్టుపల్లి గ్రమంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అల్లూరి సెంటర్లో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బచ్చల సారయ్య అధ్యక్షత నిర్వహించిన సభలో న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు 14 నెలలు పూర్తవుతున్నా అమలు కాలేదని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్నికలలో ఇచ్చిన హామీలు, ప్రకటించిన పథకాలన్నీ అమలు చేస్తామని నేటికీ అమలు చేయలేక పోయారని విమర్శించారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నేడు అమలు చేయలేక కాలయాపన చేస్తుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో పాలకులకు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేదోడిని కొట్టి ఉన్నోనికి పెట్టు అనే చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. తక్షణమే ప్రజలకు ఇస్తామన్న గ్యారెంటీలను, హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రజల పట్ల ఒకే వైఖరి కలిగి ఉన్నాయని, ప్రజలు చైతన్యమై పాలకులకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. హామీలు, వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రదర్శన, సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎట్టి నర్సింహారావు, మల్యాల మల్లేష్, ఇర్ప రాజేష్, పుణెం శ్రీను, కస్నబోయిన లింగయ్య, రవీందర్ రెడ్డి, కల్తీ మల్లయ్య, ఇర్పా బుచ్చయ్య, బొర్ర నర్సయ్య, బొర్రా విక్రమ్, కుంజా స్వామి, తప్పేట్ల రాములు, పెంటయ్య, జనగం వాసు, కల్తీ బొర్రయ్య, జనగం వెంకన్న, మల్లికాంభ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
State Level Select | రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కోటపల్లి ఆశ్రమ విద్యార్థిని ఎంపిక
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు