SL vs BAN : ఆసియా కప్‌లో రెండో దశ అయిన సూపర్ 4 యుద్ధానికి వేళైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ ఢీకొడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా సారథి లిటన్ దాస్ బౌలింగ్ తీసుకున్నాడు. సూపర్ 4ను విజయంతో ఆరంభించాలనే లక్ష్యంతో తుది జట్టులో రెండు మార్పులతో ఆడుతోంది బంగ్లాదేశ్.
గ్రూప్ దశలో ఆరు వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన లంక అదే ఉత్సాహంతోచెలరేగాలని భావిస్తోంది. దేశం కోసమని తండ్రి అంత్యక్రియలను సైతం పూర్తి చేయకుండా వచ్చిన దునిత్ వెల్లలాగేకు లంక తుది జట్టులో చోటు దక్కింది. చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గన్‌తో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నట్టు శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తెలిపాడు.
శ్రీలంక తుది జట్టు : పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), కమిల్ మిశారా, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక(కెప్టెన్), దసున్ శనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, చమీర, నువాన్ తుషార.
బంగ్లాదేశ్ తుది జట్టు : సైఫ్ హసన్, తంజిద్ హసన్, లిటన్ దాస్ (కెప్టెన్, వికెట్ కీపర్), తౌహిద్ హ్రిదయ్, షమీమ్ హొసేన్, జకీర్ అలీ, మెహెదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్.