Dunith Wellalage : ఆసియా కప్ మధ్యలో తండ్రి మరణ వార్త తెలిసి స్వదేశం వెళ్లిపోయిన దునిత్ వెల్లలాగే (Dunith Wellalage) మళ్లీ స్క్వాడ్‌తో కలిశాడు. తండ్రి సురంగా వెల్లలాగే (Suranga Wellalage )కి కన్నీటి వీడ్కోలు పలికిన అతడు సూపర్ 4 మ్యాచ్ కోసమని అంత్యక్రియలు పూర్తి చేయకుండానే దుబాయ్ వచ్చేశాడు. శనివారం రాత్రి 8:30 గంటలకు బంగ్లాదేశ్‌తో సూపర్ 4 మ్యాచ్ ఉన్నందున ఈ ఆల్‌రౌండర్ శ్రీలంక బృందంతో చేరాడు. అతడు ఉదయమే దుబాయ్ చేరుకున్నాడు. తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగుతూనే జట్టును గెలిపించేందుకు సిద్ధమవుతున్నాడీ యంగ్‌స్టర్.
గ్రూప్ బీలో భాగంగా సెప్టెంబర్ 18న శ్రీలంక, అఫ్గనిస్థాన్ తలపడ్డాయి. అయితే.. మ్యాచ్ సమయంలోనే వెల్లలాగే తండ్రి సురంగా వెల్లలాగే గుండెపోటుతో కన్నుమూశాడు. కాబూలీ టీమ్ ఇన్నింగ్స్ మధ్యలోనే ఈ విషయం కోచ్ సనత్ జయసూర్య, టీమ్ మేనేజర్ మహిందా హలంగొడెలకు తెలిసింది. అయితే.. వారు వెంటనే స్పిన్నర్‌కు ఈ వార్తను చెప్పలేదు. అఫ్గన్‌పై 6 వికెట్లతో లంక గెలుపొందిన తర్వాత జయసూర్య, మేనేజర్ మైదానంలోకి పరుగున వచ్చి వెల్లలాగేకు విషయం చెప్పి ఓదార్చారు. దాంతో.. హుటాహుటిన లంకకు బయల్దేరాడు వెల్లలాగే.
Dunith Wellalage is on a mission.
While his father’s body is still at home, He leaves for UAE to rejoin his team which is all set to play in the super 4’s in Asia cup 2025. What a sacrifice this is.. BTW his father’s funeral is to take place tomorrow (21) at Colombo.… pic.twitter.com/fDqjKcK25Y
— Nibraz Ramzan (@nibraz88cricket) September 20, 2025
కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య తండ్రికి వీడ్కోలు పలికిన అతడు.. అంత్యక్రియలకు ముందే యూఈఏ విమానం ఎక్కాడు. తాను దేశం కోసం ఆడుతుంటే చూసి గర్వించిన నాన్నకు మైదానంలో దిగి జట్టును గెలిపించే ప్రదర్శనతో వీడ్కోలు పలకాలని భావిస్తున్నాడు వెల్లలాగే. సెప్టెంబర్ 21 ఆదివారం కొలంబోలో అతడి తండ్రి అంత్యక్రియలు జరుగనున్నాయి.