కాసిపేట : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెంకు చెందిన గుజ్జుల సిరికుందన (Gujjula Sirikundana) హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ ( MBBS Seat ) సాధించింది. గుజ్జుల రాజేంద్ర ప్రసాద్-రజిత దంపతుల కుమార్తె సిరికుందన నీట్ పరీక్షలో ప్రతిభను కనబరిచింది. నీట్ ఫలితాల్లో తెలంగాణ స్టేట్ 911 ర్యాంక్ సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీట్ సాధించింది. సిరికుందన తండ్రి రాజేంద్ర ప్రసాద్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా మెడికల్ సీట్ సాధించిన సిరికుందనను పలువురు అభినందించారు.