జైసల్మేర్ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ప్రచండ్ హెలికాప్టర్లో ప్రయాణించారు. దేశీయంగా తయారైన ఈ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లో ఆమె కోపైలట్‌గా వ్యవహరించారు. ఈ హెలికాప్టర్లో కోపైలట్‌గా వ్యవహరించిన మొదటి భారత రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. ప్రయాణం సందర్భంగా కాక్‌పిట్ నుంచి ఆమె సెల్యూట్ చేశారు.
ప్రయాణానికి ముందు వైమానిక దళ అధికారులు హెలికాప్టర్ ఆపరేషన్స్ గురించి రాష్ట్రపతికి వివరించారు. ఆ తర్వాత ఆమె 25 నిమిషాల సేపు ప్రచండ్లో ప్రయాణించి పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ను, దేశ సరిహద్దులను పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం జైసల్మేర్‌లో జరిగిన వాయుశక్తి 2026 విన్యాసాల కార్యక్రమంలో సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో రాష్ట్రపతి పాల్గొన్నారు.