రైతులు నష్టపోకుండా చూడాలి
ఉమ్మడి జిల్లా రైతాంగం ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా కృషి చేద్దామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సూచించారు. నిజామాబాద్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఇన్చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా అధ్యక్షతన శనివారం నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి హాజరు కాగా, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వర్చువల్‌గా పాల్గొన్నారు.
- సమష్టి కృషితో వారి ప్రయోజనాలు కాపాడాలి
- నీటిపారుదల సలహా మండలి భేటీలో నిర్ణయం
కంఠేశ్వర్, ఆగస్టు 8: ఉమ్మడి జిల్లా రైతాంగం ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా కృషి చేద్దామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సూచించారు. నిజామాబాద్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఇన్చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా అధ్యక్షతన శనివారం నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి హాజరు కాగా, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు, కౌలాస్‌నాలా, పోచారం, రామడ్గు జలాశయాల్లో నీటి నిల్వల స్థితిగతులు, ఆయకట్టు పంటలకు సాగునీటినందించే వెసులుబాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, పంటల వైవిద్యీకరణకు రైతులకు అవగాహన కల్పించడం తదితర అంశాలపై చర్చించారు. వివిధ జలాశయాల నుంచి యాసంగి పంటలకు సాగునీటినందించేందుకు వీలుగా ప్రతీ సంవత్సరం రబీ సీజన్ సమయంలో జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశాలు జరిగేవని, అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రస్తుత సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో మున్ముందు వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నందున వరి వేసిన రైతులు నష్టపోకుండా అధికారులు చొరవ చూపాలన్నారు.
ఇటీవల తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసినప్పటికీ ఎల్‌నినో కారణంగా ఆగస్టు, సెప్టెంబర్లలో వర్షపాతం తక్కువగా నమోదయే అవకాశాలునన్నాయని, అందుబాటులోని నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరముందని నిజామాబాద్ ఇన్చార్జి కలెక్టర్ భవేశ్‌మిశ్రా తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను వృథా కాకుండా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

