Ramesh Varma -Dhruv Vikram | కోలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో ధృవ్ విక్రమ్, టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కుతోంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ (PEN Studios) అధినేత డాక్టర్ జయంతిలాల్ గడా ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. కోనేరు సత్యనారాయణ, శిరీష కుప్పాల సంయుక్తంగా శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్వి స్టూడియోస్ బ్యానర్లపై ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, అక్టోబర్ 2026లో ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
అంతేకాకుండా, హీరో ధృవ్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 23, 2026న ఈ సినిమా అధికారిక టైటిల్‌తో పాటు పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది. తాత్కాలికంగా ‘DV4’ మరియు ‘DV4XRV7’ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రచారం జరుగుతున్న ఈ యాక్షన్ మూవీపై టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తెలుగులో వీరా, ఖిలాడీ, రాక్షసుడు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రమేష్ వర్మ ఇప్పుడు తమిళంలో అడుగుపెట్టబోతున్నాడు.
DHRUV VIKRAM – RAMESH VARMA COME TOGETHER FOR TAMIL-TELUGU BILINGUAL – DR JAYANTILAL GADA PRESENTATION… #DhruvVikram will head the cast of the #Tamil – #Telugu bilingual action entertainer, directed by #RameshVarma.
Presented by Dr #JayantilalGada, the film is produced by… pic.twitter.com/DEqdQjM6Rp
— taran adarsh (@taran_adarsh) September 12, 2026