Ram Gopal Varma | టాలీవుడ్ సినిమా రంగంలో ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెనుక కేవలం నటీనటుల శ్రమే కాదు, ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్ల కష్టం కూడా ఉంటుంది. అయితే, కొంతమంది దర్శకులు తమ వద్ద పనిచేసిన ప్రతిభావంతులను కేవలం సహాయకులుగా మాత్రమే కాకుండా, స్వతంత్ర దర్శకులుగా పరిశ్రమకు పరిచయం చేసి తమ గొప్పతనాన్ని చాటుకున్నారు. టాలీవుడ్‌తో పాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇలా లెజెండరీ డైరెక్టర్లుగా మారి, ఎంతోమంది కొత్త దర్శకులను సృష్టించిన ప్రముఖుల జాబితా ఇక్కడ చూద్దాం.
రామ్ గోపాల్ వర్మ (RGV):
భారతీయ చలనచిత్ర పరిశ్రమ రూపురేఖలను మార్చిన దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఆయన కేవలం సినిమాలే కాదు, ఎంతోమంది సక్సెస్ఫుల్ డైరెక్టర్లను ఇండస్ట్రీకి అందించారు. ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చిన ప్రముఖ దర్శకులు:
కృష్ణవంశీ
పూరి జగన్నాథ్
గుణశేఖర్
తేజ
హరీష్ శంకర్
శివ నాగేశ్వర రావు
అనురాగ్ కశ్యప్
మధుర్ భండార్కర్
నివాస్
ప్రవాల్ రామన్
విశ్రామ్ సావంత్
సుకుమార్:
కథా రచయితగా ప్రయాణం మొదలుపెట్టి దర్శకుడిగా అద్భుతాలు సృష్టిస్తున్న సుకుమార్, తన సినిమాల ద్వారానే కాకుండా తన టీమ్ నుంచి అద్భుతమైన డైరెక్టర్లను తయారు చేశారు. ఆయన శిష్యులుగా ఇండస్ట్రీకి పరిచయమై సక్సెస్ కొట్టిన దర్శకులు:
బొమ్మరిల్లు భాస్కర్
శ్రీకాంత్ అడ్డాల
వేణు శ్రీరామ్
పాలనాటి సూర్యప్రతాప్
బుచ్చిబాబు సానా
శ్రీకాంత్ ఓదెల
ఎస్.ఎస్. రాజమౌళి:
ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి గారి దర్శకత్వ శాఖ (డైరెక్షన్ డిపార్ట్మెంట్) నుండి కూడా చాలా ప్రతిభావంతులు బయటకు వచ్చారు. వారిని చూసుకుంటే..
త్రిగోటి పేట
అశ్విన్ గంగరాజు
పూరి జగన్నాథ్:
తనదైన శైలి మాస్ డైలాగ్‌లు, వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో ట్రెండ్ సెట్ చేసిన పూరి జగన్నాథ్ కూడా కొందరికి గురువుగా నిలిచారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారు:
పరశురామ్
గోపి గణేష్ పట్టాభి
శేఖర్ కమ్ముల:
సహజమైన భావోద్వేగాలు, క్లీన్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించే శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసి, ఇప్పుడు టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లుగా రాణిస్తున్న వారు:
నాగ్ అశ్విన్
శశి కిరణ్ తిక్క
సాయి కిరణ్ అడవి
త్రివిక్రమ్:
‘మాంత్రికుడు’గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనతో పాటు దర్శకత్వంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన వద్ద శిష్యుడిగా మెరిసిన యువ దర్శకుడు:
వెంకీ కుడుముల
ఇంకా వీరే కాకుండా తెరవెనుక అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఎన్నో మెలకువలు నేర్చుకుని, నేడు తమ స్వంత ప్రతిభతో తెలుగు సినిమా పరిశ్రమను నడిపిస్తున్న ఈ దర్శకుల ప్రయాణం ఎందరో యువతకు స్ఫూర్తిదాయకం.