Smriti Mandhana : వన్డే ఫార్మాట్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. మూడో వన్డేలో ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేస్తున్న ఈ డాషింగ్ ఓపెనర్ వేగవంతమైన సెంచరీతో చరిత్ర సృష్టించింది. కేవలం 50 బంతుల్లోనే విధ్వంసక శతకంతో రెచ్చిపోయిన మంధాన భారత్ తరఫున వన్డేల్లో తక్కువ బంతుల్లోనే వంద కొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. తద్వారా అజారుద్దీన్, విరాట్ కోహ్లీ (Virat Kohli), వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) వంటి దిగ్గజాల రికార్డును బ్రేక్ చేసిందీ బ్యాటర్.
వరల్డ్ కప్ ముందు జరుగుతున్న వన్డే సిరీస్‌లో జోరు చూపిస్తున్న మంధాన ఆస్ట్రేలియా బౌలర్ల పాలిట విలన్లా మారింది. రెండో వన్డేలో శతకంతో జట్టును గెలిపించి సిరీస్ సమం చేయడంలో కీలకమైన తను.. మూడో వన్డేలోనూ తన ప్రతాపం చూపించింది. ఆసీస్ బౌలర్లను వణికిస్తూ బౌండరీల మోతతో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరువైన మంధాన.. మరో 27 బంతుల్లోనే శతకం సాధించింది. దాంతో, వన్డేల్లో మనదేశం నుచి వేగవంతమైన వందతో రికార్డుల దుమ్ముదులిపిందీ యంగ్‌స్టర్.
First #TeamIndia batter to score back-to-back ODI hundreds twice in women’s cricket 🔥
Exemplary batting from Smriti Mandhana 🙌
Updates ▶️ https://t.co/Z0OmZGVfVU#INDvAUS | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/6tGBaqkAme
— BCCI Women (@BCCIWomen) September 20, 2025
అంతేకాదు.. భారత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యంకాని రికార్డు తన పేరిట రాసుకుందీ వైస్ కెప్టెన్. మహిళల వన్డే ఫార్మాట్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన క్రికెటర్‌గానూ నిలిచింది మంధాన. ఆసీస్ మాజీ సారథి మేగ్ లానింగ్ 45 బంతుల్లో సెంచరీతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
స్మృతి మంధాన – 50 బంతుల్లో, ఆస్ట్రేలియపై, 2025లో.
విరాట్ కోహ్లీ – 52 బంతుల్లో, ఆస్ట్రేలియాపై, 2013లో.
వీరేంద్ర సెహ్వాగ్ – 60 బంతుల్లో, న్యూజిలాండ్‌పై, 2009లో.
మొహ్మమద్ అజారుద్దీన్ – 62 బంతుల్లో, న్యూజిలాండ్‌పై, 1988లో.
కేల్ రాహుల్ – 62 బంతుల్లో, నెదర్లాండ్స్‌పై, 2023లో.
Fastest ODI hundreds for India 🤩
1. Smriti Mandhana – 50 balls vs AUS, 2025
2. Virat Kohli – 52 balls vs AUS, 2013#CricketTwitter #INDWvsAUSW pic.twitter.com/7pqu8wqmLP— Cricbuzz (@cricbuzz) September 20, 2025