INDW vs AUSW : వరల్డ్ కప్ ముందు భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఫామ్ కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో సూపర్ సెంచరీ బాదిన మంధాన.. మూడో వన్డేలో అర్ధ శతకం కొట్టింది. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుందీ వైస్ కెప్టెన్. దాంతో.. భారత మహిళల జట్టు తరఫున వన్డేల్లో వేగవంతమైన ఫిప్టీతో రికార్డు నెలకొల్పింది మంధాన. అషే గార్డ్నర్ ఓవర్లో రెండు ఫోర్లతో యాభైకి చేరువైన ఈ డాషింగ్ ఓపెనర్ బౌండరీలతో ఆసీస్ బౌర్లను ఊచకోత కోస్తోంది.
ఆస్ట్రేలియా నిర్దేశించిన భారీ ఛేదనను భారత్ దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్ ప్రతీకా రావల్ (10) తొలి ఓవర్లో రెండు ఫోర్లతో చెలరేగింది. ఆ తర్వాత స్మృతి మంధాన(55 నాటౌట్) తన మార్క్ షాట్లతో అలరిస్తూ స్కోర్ బోర్డును ఉరికించింది. ఆ జట్టు ప్రధాన పేసర్ మేగన్ షట్ వేసిన మూడో ఓవర్లలో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన మంధాన ప్రత్యర్ధిని కంగారెత్తించింది.
Fifty off just 23 deliveries 🔥🔥
Vice-captain Smriti Mandhana registers the Fastest ODI Fifty by an Indian batter in women’s cricket! 🫡
Fifty partnership 🆙 for the 2nd wicket 🤝
Updates ▶️ https://t.co/Z0OmZGUI6m#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/g5fWLxpAcI
— BCCI Women (@BCCIWomen) September 20, 2025
అనంతరం కిమ్ గార్త్ బౌలింగ్‌లో ప్రతీకా వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్(11)తో మంధాన కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ.. టీమిండియాకు రెండో షాకిస్తూ డియోల్‌ను వెనక్కి పంపింది మేగన్. ప్రస్తుతం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (9 నాటౌట్), మంధాన జట్టును గెలుపుబాట పట్టించే పనిలో ఉన్నారు. 10 ఓవర్లకు స్కోర్.. 96/2. ఇంకా టీమిండియా విజయానికి 317 పరుగులు కావాలి.