కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 20 : సేవ చేయడంలోనే సంతృప్తి ఉంటుందని, ప్రతీ ఒక్కరు ఎంతో కొంత సమాజానికి తమ వంతు సేవ చేయాలని ఎముకలు, కీళ్ల శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ వరుణ్ కుమార్ అన్నారు. శనివారం కొత్తగూడెం పట్టణంలోని సత్యసాయి ఆశ్రమంలో వృద్ధులకు ఉచితంగా పరీక్షలు నిరసించి మందులను, నిత్యవసర వస్తువులను, పండ్లను పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలతో మానసిక ఉల్లాసంతో పాటు, సామాజిక సేవ చేసిన తృప్తి కలుగుతుందన్నారు. భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలు తమ హాస్పిటల్ ద్వారా చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.