Sita Rama Kalyana Talambralu | శ్రీరామ నవమిని పురస్కరించుకుని భద్రాచలం వెళ్లాలనుకొని వెళ్లలేకపోతున్న భక్తులకు శ్రీరాముని కల్యాణోత్సవ తలంబ్రాలు కావాలనుకునే వారి కోసం కేవలం 151/-రూపాయలు చెల్లిస్తే.. ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా ఇంటికే వస్తాయని వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వీ వేణు గోపాల్ తెలిపారు.
శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాచల రాముడి కల్యాణోత్సవ తలంబ్రాలు వనపర్తి పట్టణ, పరిసర గ్రామాల ప్రజల కోసం ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా ఇంటికే అందజేయున్నట్టు డిపో మేనేజర్ తెలిపారు.
బస్ స్టేషన్ నందు ఉన్న ఆర్టీసీ కార్గో కౌంటర్లలో ఈ సౌకర్యం కలదు. కావున భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకై 91542 98616 సెల్ నెంబర్‌ను సంప్రదించాలని డిపో మేనేజర్ తెలిపారు. కళ్యాణ తలంబ్రాలు కావల్సిన వారు 9848978757కు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చనన్నారు.
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?