22Aళ విషయంలో తప్పు జరిగింది నిజం. పొంగులేటి క్షమాపణలు చెప్పింది నిజం. టోల్ ఫ్రీ నంబర్ పెట్టింది నిజం. అయినా ఉల్టా దబాయిస్తవు. నా ఇల్లు పెడితే మంత్రి ఉంటడా అంటున్నవ్. మరి ప్రజల భూములు పెట్టిన నువ్ ఉంటవా? నీ ప్రభుత్వం ఉంటదా? ఆలోచించుకో..
రాత్రికి రాత్రే భూములను నిషేధిత జాబితాలో చేర్చిండ్రని ప్రజలే గగ్గోలు పెడుతున్నరు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ల సమస్య వస్తే నేను ముక్కునేలకు రాస్త.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే సమస్య వచ్చిందని ప్రజలు చెప్తే నువ్వు రాస్తవా? రేవంత్‌రెడ్డీ?
తెలంగాణలో భూ భారతి పేరుతో జరుగుతున్న భూ కుంభకోణాలు, రైతులు.. సామాన్యుల భూములతో చెలగాటమాడుతున్న 22ఏ, సీఎం సోదరుల భూ కుంభ కోణాలపై ఎలాంటి తప్పులు జరుగకపోతే రేవంత్ సర్కార్ ఎందుకు భయపడుతున్నది? ప్రభుత్వం తప్పు చేయకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రావాలి.
22ఏ నుంచి నీ ఇల్లు మాత్రం తీసుకున్నవ్. దానికి ఏ హై పవర్ కమిటీ లేదు. లీగల్‌గా ఆలోచించేది లేదు. నీ ఇల్లు ఎట్లా తీసుకున్నవో? ప్రజల ఇండ్లు కూడా అట్లా ఎందుకు తీయవు? మీ చర్చ ద్వారా ప్రజలకు ఏదైనా మేలు జరిగిందా? ప్రజలకు రిలీఫ్ దొరికిందా?
-మీడియా సమావేశంలో హరీశ్

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో భూ భారతి పేరుతో జరుగుతున్న భూ కుంభకోణాలు, అప్పనంగా ఇస్తున్న భూములు, రైతుల, సామాన్యుల భూములతో చెలగాటమాడుతున్న 22ఏతోపాటు ముఖ్యమంత్రి సోదరుల భూ కుంభకోణాలపై ఎలాంటి తప్పులు జరుగకపోతే రేవంత్ సర్కార్ ఎందుకు భయపడుతున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ తప్పూ చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి, ఆయన సోదరులు చేస్తున్న భూ కుంభకోణాలపై మీడియాతో మాట్లాడారు. ‘నీ తమ్ముడు లక్ష రూపాయల మూలధనంతో పెట్టిన కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమిని కేటాయించిన విషయం బయటపెట్టిందే బీఆర్ఎస్. దాని మీద ప్రభుత్వ గొంతు ఎందుకు మూగబోయింది?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
‘పసుమావులలో నీ అన్నదమ్ములకు 4 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే నాలా కన్వర్షన్ చేసి ఏ రకంగా సామ్‌కి పాల్పడ్డవో ఆధారాలు సహా బయటపెట్టిందే బీఆర్ఎస్. దాని మీద రేవంత్‌రెడ్డి గొంతు ఎందుకు మూగబోయింది?’ అని హరీశ్‌రావు నిలదీశారు.
‘డైమండ్‌హిల్స్, గచ్చిబౌలి కుంభకోణం, రాందాస్‌పల్లి కుంభకోణం, కారామెట్లో సురేశ్‌బాబుకు సంబంధించిన భూ కుంభకోణం.. విఠలారాథా గచ్చిబౌలి కుంభకోణం, రాఘవ-ఫీనిక్స్ మధ్య జరిగిన అక్రమ కుంభకోణాల మీద ఎందుకు మాట్లాడరు? ఎందుకు వాటికి సమాధానం ఇవ్వరు? ఒకవేళ మీరు తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రావచ్చు కదా? ఎందుకు రావడం లేదు?’ అని హరీశ్‌రావు నిలదీశారు.
ధరణితో నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్..
ధరణిలో 2020 అక్టోబర్ నుంచి జనవరి 2023 వరకు 23,20,233 ట్రాన్సాక్షన్స్ అయ్యాయని హరీశ్‌రావు చెప్పారు. 17,30,909 రిజిస్ట్రేషన్లు జరిగితే, వాటిల్లో 16,59,866 పరిష్కారమయ్యాయని చెప్పారు. ఆ సమస్య పరిషరించడానికి తీసుకున్న సగటు సమయం 47 నిమిషాలేనని తేల్చారు. ‘47 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయింది. వారసత్వ హకులు సక్సెషన్ 1,98,208 మందికి వారసత్వం, సక్సెషన్ జరిగింది.
అందుకు తీసుకున్న సగటు సమయం 26 నిమిషాలు. 24,22,874 పార్టీషన్ డీడ్స్ జరిగితే సగటు సమయం 31 నిమిషాలు. పెండింగ్ మ్యుటేషన్లలో 1,79,216 మ్యుటేషన్లకు తీసుకున్న సమయం 32 నిమిషాలు. 95,676 నాలా కన్వర్షన్లకు తీసుకున్న సమయం 28 నిమిషాలు’ అని హరీశ్‌రావు వివరించారు. అంత చకగా కొన్ని గంటల వ్యవధిలో, నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు లక్షల మందికి జరిగితే.. ఎకడో ఒకటో రెండో చిన్న పొరపాట్లను సరిదిద్దాల్సిన ప్రభుత్వం.. అలా చేయకుండా చాలెంజ్ స్కామ్‌కు వేదికైన భూభారతిని తెచ్చిందన్నారు. ‘భూ భారతి ద్వారా ప్రజలకు తెలియకుండా ప్రజల ఆస్తులను బదిలీ చేశారు. ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చారు. వీటి మీద చర్చ చేయరా? దాని మీద విచారణకు ప్రభుత్వం ముందుకు రాదు?’ అని హరీశ్‌రావు నిలదీశారు.
భూ కుంభకోణాలపై నీ సమాధానం ఏది?
‘భూభారతిలో జరిగిన అవకతవకలు, కుంభకోణాలను తెలంగాణభవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక్కొక్కటిగా బయటపెట్టాం. నువ్వు మా మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నావు కానీ, మేము లేవనెత్తిన, ప్రశ్నించిన ఒక కుంభకోణం మీదనైనా ప్రభుత్వం సమాధానం చెప్పిందా?’ అని హరీశ్‌రావు నిలదీశారు.
‘నాదర్గుల్లో 373 ఎకరాల భూ కుంభకోణాన్ని సాక్ష్యాధారాలు సహా బీఆర్ఎస్ బయటపెట్టింది.
అది ప్రభుత్వ భూమి అని ఆర్డీవో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తాడు. ప్రభుత్వ భూమి అని నిషేధిత జాబితాలో రెవెన్యూ రికార్డులో ఉంటది. భూమేమో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. హైడ్రా కండ్లు మూసుకుంటది. ఆర్డీవో నిద్రపోతుంటడు. రూ.10,000 కోట్ల విలువైన నాదర్గుల్ భూముల సామ్‌ను బీఆర్ఎస్ బయటపెట్టినా ఎందుకు అసెంబ్లీలో సమాధానం చెప్పలేదు?’ అని హరీశ్ మండిపడ్డారు.
11,19,000 మందికి సాదా బైనామా
‘బీఆర్ఎస్ ఏం పని చేయలేదు, అంతా కాంగ్రెసే చేసింది.. బీఆర్ఎస్ హయాంలో సమస్యలకు పరిషారమే చూపలేదనే ఎదురుదాడి దిగుతున్నారు. మీరు అలా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజమవుతాయా? నిజాలు అబద్ధాలుగా మారుతయా.. రేవంత్‌రెడ్డీ?’ అని హరీశ్‌రావు నిలదీశారు. ‘ధరణితో 11,19,000 మందికి నయా పైసా ఖర్చు లేకుండా సాదాబైనామా చేసింది బీఆర్ఎస్ కాదా? ఆ 11,19,000 మంది రైతులకు తెలుసు కదా నువ్వు మాట్లాడింది అబద్ధమని. దాదాపు 4-5 లక్షల ఎకరాల గిరిజనుల భూములకు పోడు పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్. వాటికి రైతుబంధు ఇచ్చింది బీఆర్ఎస్. ఆ భూములకు త్రీఫేజ్ కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కదా? నువ్వు ఒక ఎకరం ఇచ్చినవా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
‘జీవో-76ను వైఎస్సార్ ఇచ్చారని మంత్రి పొంగులేటి అబద్ధమాడితే.. బీఆర్ఎస్ ఇచ్చిందని ముఖ్యమంత్రి నిజం ఒప్పుకొన్నడు. ఆ జీవో-76 ఇచ్చి ఆరువేల మంది సింగరేణి కార్మికులకు పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్లకు హకులు కల్పించింది బీఆర్ఎస్’ అని హరీశ్‌రావు తేల్చి చెప్పారు.
చివర్లో ప్రాసెస్‌లో ఉన 2-3 వేల మందికి మీరు వచ్చిన మూడేండ్ల నుంచి పట్టాలు ఆపి, ఆఫీసుల చుట్టూ తిప్పి, అన్నీ నిషేధిత జాబితాలో పెట్టి సింగరేణి కార్మికుల ఉసురు పోసుకున్నది మీరు కాదా?’ అని అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హెచ్‌సీయూ భూములు బాంబే స్టాక్ ఎక్సె ంజ్కు..
‘హెచ్‌సీయూ భూములు విద్యార్థులు పోరాడి కాపాడుకుంటే ఆ విద్యార్థులకు తెలవకుండా ఆ భూములను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు కుదువపెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.

Harishrao
‘రంగారెడ్డి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో 9 వేల ఎకరాలు కుదువపెట్టి బాంబే స్టాక్ ఎక్స్చెంజ్లో మరొక రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారు. బ్రోకర్లకు రూ.200 కోట్ల లంచం ఇచ్చుకుంటూ అప్పులు తెచ్చింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఇయ్యాల మీరు మా మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నరు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు’ అని అన్నారు.
‘22ఏకు చర్చ ద్వారా ఒక క్లారిటీ వస్తదని ఆశించాం. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం అలాంటిదేమీ లకేండా యూఎల్సీ భూముల మీద న్యూ పాలసీ గైడ్‌లైన్స్ ఇస్తామని చెప్తున్నార’ని హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేశారు.
కమిటీలు, పాలసీలతో కాలయాపన
‘సింగరేణికి జిల్లా స్థాయిలో కమిటీ ఎందుకు? ఇప్పటికే జీవో-76 ఉంది’ అని హరీశ్‌రావు అన్నారు. ‘జీవో-118, ఎల్ఆర్ఎస్, సింగరేణి, హెచ్ఎండీఏ, డీటీసీపీ భూములు, అసైన్డ్ భూములు నాలాలు, ఇందిరమ్మ ఇండ్లు, భూదాన్ భూములు అంటూ.. వాటిని పరిశీలిస్తాం, హై లెవల్ కమిటీ వేస్తాం. ఆలోచిస్తాం. లీగల్‌గా పరిషరిస్తాం. విసృ్తత స్థాయిలో సంప్రదింపులు జరుపుతాం. ఫీజులు కట్టించుకుంటాం. గైడ్‌లైన్స్ ఇస్తామని చెప్పడం తప్ప.. ప్రజలకు ఉపయోగపడేది ఏదీ చెప్పలేదు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘22ఏ నుంచి నీ ఇల్లు మాత్రం తీసుకున్నావు. నీ ఇంటికి ఏ హై పవర్ కమిటీ లేదు. లీగల్‌గా ఆలోచించేది లేదు. కమిటీ వేసేది లేదు. పరిషరించేది లేదు’ అని హరీశ్వ్రు ఎద్దేవా చేశారు. ‘నీ ఇల్లు ఎట్లా తీసుకున్నావో? ప్రజల ఇండ్లు కూడా అట్లా ఎందుకు తీయవు? ఈ చర్చ ద్వారా ప్రజలకు ఏదైనా మేలు జరిగిందా? ప్రజలకు రిలీఫ్ దొరికిందా? ఉత్తమాటలు చెప్పి, ఎదురుదాడి తప్ప.. సమస్య నుంచి తప్పించుకొనే ప్రయత్నం రేవంత్‌రెడ్డి చేసిండు’ అంటూ తీవ్రస్థాయిలో హరీశ్‌రావు మండిపడ్డారు.
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?
ధరణి గురించి ఏదో చెప్పి బీఆర్ఎస్ నేతలపై బురదజల్లి తప్పించుకుందామనుకుంటే కుదరదని హరీశ్‌రావు హెచ్చరించారు. ‘కేసీఆర్, కేటీఆర్, నా మీద, మా పార్టీ నాయకుల మీద ఇన్ని ఆరోపణలు చేసినవ్ కదా. నిన్ను నేరుగా ఒకే ప్రశ్న అడుగుతున్న రేవంత్‌రెడ్డీ.. బీఆర్ఎస్ హయాంలో ధరణి విషయంలో కావచ్చు.. కాంగ్రెస్ వచ్చిన 2023 డిసెంబర్ 7 నుంచి కావచ్చు.. మీ హయాంలో జరిగిన అంశాలపై, మా హయాంలో జరిగిన అంశాలపై విచారణకు మేము సిద్ధం. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో చేపిద్దామా? హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చేపిద్దామా? రా ముందుకు. నీ సిట్.. నీ కింద పనిచేసే అధికారులతో కాదు.. నీది కాదు.. నాది కాదు.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దాం.. మీ ఆస్తులు, మా ఆస్తుల గురించి కూడా మాట్లాడుదాం. నీవి, మీ తమ్ముళ్లవి ఆస్తులు ఎట్లా పెరిగాయో విచారణకు వెళ్దాం.. నువ్వు రెడీనా? దాని మీద మేము చర్చకు సిద్ధం’ అని హరీశ్‌రావు సవాల్ విసిరారు.
58, 59 జీవోలతో 2 లక్షల కుటుంబాలకు భద్రత
‘58, 59 జీవో తెచ్చి 2 లక్షల కుటుంబాలకు పట్టాలు ఇచ్చి భద్రత కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే, దాన్ని కూడా ఆపినవు కదా రేవంత్‌రెడ్డీ? ఎల్బీనగర్లో జీవో-118 ద్వారా కొన్ని వేల మందికి రిజిస్ట్రేషన్ హకులు మేము కల్పించినం. నువ్వు వచ్చి ఇప్పుడు మూడేండ్లకెళ్లి ఆపినవు. పని చేసింది మేము.. సమస్యను ఉత్పన్నం చేసింది నువ్వు. జీవో-118లో మేము క్లియరెన్స్ చేస్తే దాన్ని 22ఏలో పెట్టావు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. పోడు భూములకు ఒక ఎకరాకి పట్టా ఇచ్చింది లేదని మండిపడ్డారు.
అప్పుడేమో రేవంత్‌రెడ్డి మాట్లాడితే.. నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అని విమర్శించారు. తాము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని చెప్పారు.. ఆ తర్వాత పేదల నుంచి ముక్కు పిండిమరీ డబ్బులు వసూలు చేశారని దుయ్యబట్టారు. సాదాబైనామాలో సెకండ్ టైమ్ కొన్ని దరఖాస్తులను బీఆర్ఎస్ సర్కార్ తీసుకుంటే.. వాటిని కూడా మొత్తం రిజెక్ట్ చేసి, అన్నీ ప్రీజ్ చేసిండని మండిపడ్డారు. ‘పేదల ఇండ్ల మీదికి హైడ్రా పెట్టి బుల్డోజర్లు పంపిస్తున్నరు. ఎస్ఆర్ఎస్తో ఫీజులు వసూలు చేసి పేదల ఉసురుపోసుకున్నరు. ఇయ్యాల ప్రజల ఆస్తుల మీద 22ఏ పెట్టి నిషేధ ఉత్తర్వులు జారీ చేసిర్రు. ఇది మీ నిర్వాకం. మీరు చేసిందేమీ లేదు, సమస్యలు క్రియేట్ తప్ప’ అంటూ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
