హోమ్‌లోన్‌పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హోమ్లోన్లపై వడ్డీరేటును పెంచింది. మార్చి 31 వరకూ అతి తక్కువ వడ్డీ రేటు (6.7 శాతం)కు హోమ్‌లోన్ అందించిన ఎస్బీఐ.. ఆ గడువు ముగియడంతో వడ్డీరేటును 6.95 శాతానికి పెంచింది. ఈ కొత్త వడ్డీరేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆ బ్యాంకు తన వెబ్సైట్లో వెల్లడించింది. ఇంత వరకూ ఎస్బీఐను చూసి వడ్డీ రేట్లు తగ్గించిన ఇతర బ్యాంకులు కూడా ఇప్పుడు పెంచే అవకాశాలు ఉన్నాయి.
వడ్డీ రేటు పెంచడమే కాదు.. ఇక నుంచీ అన్ని హోమ్లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేయనున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది. బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు రూపంలో 0.4 శాతం ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తుంది. ఇది సాధారణంగా కనిష్ఠంగా రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.30 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. పరిమిత సమయానికి గత నెలలో ఎస్బీఐ హోమ్లోన్లపై వడ్డీ రేటును తగ్గించడంతోపాటు ప్రాసెసింగ్ ఫీజును ఎత్తేసిన విషయం తెలిసిందే.
ఇవికూడా చదవండి..
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కర్ణాటక ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట
మహారాష్ట్ర హోంమంత్రిపై సీబీఐ ప్రాథమిక విచారణ: హైకోర్టు
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

